పదో తరగతి పరీక్షలను మే 6వ తేదీ లేదా 9నుంచి నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. సాధారణంగా ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే పదో తరగతి పరీ క్షలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మే5వ తేదీన అయిపోతున్నాయి. దీని ప్రకారంగా చూసుకుంటే మే 6వ తేదీ శుక్రవారం నుంచి లేదా మే 9 సోమవారం నుంచైనా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా కరోనా నేపథ్యంలో తరగతులు సరిగా నిర్వహించకపోవడంతో ఈ సారి కూడా పదో తరగతి పరీక్షలు 70 శాతం సిలబస్‌తో ఆరు పేపర్లతో నిర్వహించనున్నారు.