సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం.. 2025-26 విద్యా సంవత్సరానికి దూర విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు భాష, లలిత కళలపై ఆసక్తి ఉన్న వారు, ఉద్యోగ రీత్యా రెగ్యులర్ కోర్సులు చేయలేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పీజీ.డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు. మార్చి 31వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
కోర్సుల వివరాలు:
యూనివర్సిటీ 3 విభాగాల్లో కోర్సులను అందిస్తోంది.
పీజీ. డిప్లమా కోర్సులు: ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ప్రత్యేక నైపుణ్యాల కోసం ఈ కోర్సులు ఉపయోగపడతాయి.
డిప్లొమా కోర్సులు: వివిధ వృత్తి విద్యలు, కళలపై ఆసక్తి ఉన్న వారి కోసం ఈ కోర్సులు.
సర్టిఫికేట్ కోర్సులు: స్వల్పకాలిక కోర్సుల ద్వారా ప్రాథమిక అవగాహన పెంచుకోవాలనుకునే వారి కోసం ఈ కోర్సులు ఉపయోగపడతాయి.
తెలుగు జర్నలిజం, జ్యోతిష్యం, సంగీతం, నృత్యం, భాషా అనువాదం వంటి విభిన్న రంగాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు:
- పీజీ డిప్లొమా కోర్సులు:
ఈ కోర్సులు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం.
టీవీ జర్నలిజం: టెలివిజన్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
జ్యోతిర్వాస్తు: వాస్తు శాస్త్రంపై శాస్త్రీయ అవగాహన కోసం ఈ కోర్సును రూపొందించారు. దీనికి కూడా ఏదైనా డిగ్రీ కనీస అర్హత.
- డిప్లొమా కోర్సులు:
వృత్తి విద్యా నైపుణ్యాల కోసం ఈ కోర్సులను ఎంచుకోవచ్చు.
జ్యోతిష్యం: జ్యోతిష్య శాస్త్రంలో ప్రాథమిక అవగాహన కోసం ఈ కోర్సు ఉపయోగపడుతుంది. అభ్యర్థులు కనీసం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
ఫిల్మ్ రైటింగ్ (సినిమా రచన): సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాయడంపై ఆసక్తి ఉన్నవారు ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) అర్హతతో ఈ కోర్సులో చేరవచ్చు.
లలిత సంగీతం: దీనికి ప్రత్యేకమైన సర్టిఫికేట్లు అవసరం లేదు. అభ్యర్థికి చదవడం, రాయడం తెలిసి ఉండాలి. సంగీతం పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండాలి.
- సర్టిఫికేట్ కోర్సులు:
స్వల్పకాలిక శిక్షణ కోసం ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
జ్యోతిష్యం: జ్యోతిష్యంలో ప్రాథమిక పరిజ్ఞానం కోసం ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణతతో ఇందులో చేరవచ్చు.
మోడ్రన్ తెలుగు (ఆధునిక తెలుగు): తెలుగు మాతృభాష కాని వారు లేదా తెలుగును కొత్తగా నేర్చుకోవాలనుకునే వారి కోసం ఇది. రూపొందించబడింది. ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన వారు అర్హులు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారికి ఇది చాలా ఉపయోగకరం.
- సంగీత విశారద:
శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
అర్హత: ఈ కోర్సులో చేరే నాటికి అభ్యర్థికి కనీసం 12 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి.
అప్లికేషన్ ప్రక్రియ, గడువు:
అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
సాధారణ ఫీజుతో అభ్యర్థులు మార్చి 31వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ గడువులోగా అప్లై చేయలేని వారు లేట్ ఫీజుతో ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకునే వీలుంది.
సంప్రదించాల్సిన వెబ్‌సైట్లు & ఫోన్ నంబర్లు:
కోర్సుల వారీగా, ఫీజు వివరాలు, ఇతర నిబంధనల కోసం అభ్యర్థులు ఈ కింది వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.
హెల్ప్‌లైన్ నంబర్:
7330623411
ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనుకునే వారికి, తెలుగు సంస్కృతిపై మక్కువ ఉన్న వారికి ఈ దూర విద్యా కోర్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. విశ్వ విద్యాలయ అధికారులు సూచించారు.





