తెలంగాణలో చదువు మధ్యలోనే ఆపేసిన వారికి, ఉద్యోగాలు చేస్తూ చదువుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (TOSS) 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ఓపెన్ టెన్త్ (SSC), ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. జూన్ 29 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా జులై 28 లోపు అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర్లోని మీసేవ లేదా టీజీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
అర్హతలు:
ఏవైనా కారణాల వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన వాళ్లకు, ఉద్యోగాలు చేసుకుంటూ సర్టిఫికెట్ కావాలనుకునే వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం. రెగ్యులర్ స్కూల్స్, కాలేజీలకు వెళ్లలేని మహిళలు, డ్రాపౌట్స్ ఎవరైనా సరే.. ఈ ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ పూర్తి చేయవచ్చు. ఇక్కడ వచ్చే సర్టిఫికెట్లకు రెగ్యులర్ చదువుతో సమానంగా వాల్యూ ఉంటుంది.
అప్లికేషన్లకు చివరి తేదీ:
అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. లేట్ ఫీజు (ఫైన్) కట్టకుండా అప్లై చేసుకోవడానికి జులై 28 వరకు టైమ్ ఉంది. కాగా
లేట్ ఫీజుతో లాస్ట్ డేట్ ఆగస్టు 29.
ఎలా అప్లై చేసుకోవాలి?
దగ్గర్లో ఉండే ‘మీసేవ’ (Meeseva) లేదా ‘టీజీ ఆన్‌లైన్’ (TGonline) సెంటర్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్, గతంలో చదివిన సర్టిఫికెట్లు (ఉంటే), పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తీసుకెళ్లాలి.
మీకు అడ్మిషన్ల గురించి ఏవైనా సందేహాలు ఉంటే బోర్డు అఫీషియల్ హెల్ప్‌లైన్ నంబర్ +932 6936300556 కి ఫోన్ చేసి వివరాలు కూడా అడగవచ్చు.





