తెలంగాణ విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియరైంది. తెలంగాణ నార్త్ డిస్కం (TGNPDCL) పరిధిలో 339 ఉద్యోగాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో చీఫ్ ఇంజినీర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎంజినీర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ లైన్‌మన్ వంటి పోస్టులున్నాయి. ఈ పోస్టుల నియామకానికి.. గతంలో ఉపయోగంలో లేనట్లు గుర్తించిన 433 పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా 339 ఉద్యోగాలకు ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది.
పోస్టు | పోస్టుల సంఖ్య |
---|---|
చీఫ్ ఇంజనీర్ (ఇంజ.) | 1 |
చీఫ్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్) | 1 |
జాయింట్ సెక్రటరీ (PR&G) | 1 |
సూపరింటెండెంట్ (జనరల్) | 4 |
జనరల్ మేనేజర్ (P&G) | 1 |
డివిజనల్ ఇంజనీర్ | 4 |
సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ | 4 |
అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ | 6 |
అకౌంట్స్ ఆఫీసర్ | 1 |
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ | 2 |
పర్సనల్ ఆఫీసర్ | 4 |
అసిస్టెంట్ ఇంజనీర్ | 16 |
సబ్-ఇంజనీర్ | 10 |
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ | 40 |
సీనియర్ అసిస్టెంట్ | 88 |
సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ | 32 |
అసిస్టెంట్ లైన్‌మన్ | 48 |
ఆఫీస్ సబార్డినేట్ | 60 |
వాచ్‌మన్ | 4 |
స్వీపర్ కమ్ గార్డనర్, స్వీపర్, సానిటరీ ఆర్డర్లీ | 6 |