HomeJOBSనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్త్రీ నిధిలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్త్రీ నిధిలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

తెలంగాణ స్త్రీ నిధి సంస్థ.. 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉండి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములయ్యే ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. మహిళా సాధికారత దిశగా పని చేసే ఈ ప్రభుత్వ అనుబంధ సంస్థలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశం.

నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు:
ఖాళీల సంఖ్య: 123 (అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు)

విద్యార్హతలు:

1.అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

2.కంప్యూటర్ పరిజ్ఞానం (MS Office) కలిగి ఉండటం అదనపు అర్హతగా పరిగణించబడుతుంది.

3.స్థానిక భాష (తెలుగు)పై పట్టు ఉండటం తప్పనిసరి.

వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అంతే కాకుండా గరిష్టంగా 35 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక విధానం:
అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ సాధారణంగా రెండు దశల్లో ఉంటుంది.

రాత పరీక్ష: అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ: రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.

అప్లికేష్లకు చివరి తేదీ:
మే 29 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ విధానం:

1.ముందుగా స్త్రీ నిధి అధికారిక వెబ్‌సైట్‌ https://www.streenidhi.telangana.gov.in లోకి లాగిన్ అవ్వాలి.

2.హోమ్ పేజీలో ఉన్న ‘Recruitment 2026’ లింక్‌పై క్లిక్ చేయాలి.

3.అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అప్లికేషన్ ఫారమ్‌ను నింపాలి.

  1. ఫోటో, సంతకంతో పాటు అవసరం అయిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

5. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేసి..ప్రింట్ తీసుకోవాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here