కాలేజీ లెక్చరర్లు, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బోధించేందుకు అర్హత కల్పించే టీజీసెట్ 2025 (TGSET 2025) నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో డిసెంబర్ రెండో వారం నుంచి పరీక్షలు మొదలవుతాయి.
అర్హతలు
అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీలోఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంసీఏ, ఎంఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా ఈ టెస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షా విధానం..
TG-SET పరీక్ష మొత్తం 29 సబ్జెక్టులకు నిర్వహిస్తారు. పేపర్-1 (జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్).. ఇందులో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. పేపర్-2 (అభ్యర్థి పీజీ సబ్జెక్టు).. ఇందులో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. .
టీజీసెట్ పరీక్ష నిర్వహించే సబ్జెక్టులు..
టీజీసెట్ పరీక్ష మ్యాథమెటికల్ సైన్సెస్, 6ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్, జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రాలు
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి తో పాటు ఏపీలో విజయవాడ, కర్నూలు, తిరుపతి, వైజాగ్ లో పరీక్ష నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ http://www.telanganaset.org/





