HomeLATESTస్పోర్ట్స్​ ​ స్కూల్స్​లో అడ్మిషన్స్​ 2022-23

స్పోర్ట్స్​ ​ స్కూల్స్​లో అడ్మిషన్స్​ 2022-23

తెలంగాణ క్రీడా సాధికార సంస్థ ‘సాట్స్​’– కరీంనగర్​, ఆదిలాబాద్​, హకీంపేట్​ స్పోర్ట్స్​ స్కూళ్లలో 4, 5వ తరగతులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఫిజికల్​ మరియు మెడికల్​ టెస్టులు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు.

Advertisement

4వ తరగతిలో చేరేందుకు 8–9 సంవత్సరాలు, 5వ తరగతిలో ప్రవేశానికి 9–10 సంవత్సరాల వయసు ఉండాలి. ముందుగా విద్యార్థులకు బరువు, ఎత్తును కొలుస్తారు. తర్వాత ఫిజికల్​ టెస్ట్​లో భాగంగా 30 మీటర్ల ప్లయింగ్​ స్టార్ట్​, స్టాండింగ్​ బ్రాడ్​ జంప్​, 800 మీటర్ల రన్నింగ్​, 6 నిమిషాల్లో 10 మీటర్ల షటిల్​ రన్​, మెడిసిన్​ బాల్​ త్రో, వర్టికల్​ జంప్​, ప్లెక్స్​బిలిటీ టెస్ట్​ నిర్వహిస్తారు. అనంతరం మెడికల్​ టెస్ట్​లో భాగంగా వయసు ధృవీకరణ, బోన్​ అబ్​నార్మాలిటీని పరీక్షించి ఎంపిక చేస్తారు.

ఆసక్తి గల విద్యార్థులు ముందుగా మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబర్చిన వారికి కరీంనగర్​, ఆదిలాబాద్​, హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్​ స్కూళ్లలో అడ్మిషన్లు ఇస్తారు.

మండల స్థాయిలో ఫిబ్రవరి 20, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 26, రాష్ట్ర స్థాయిలో మార్చి 1నుంచి 14వ తేదీ వరకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో మొత్తం 240 సీట్లను ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనున్నారు.

Advertisement

ఎంపికైన విద్యార్థులకు స్పోర్ట్స్​స్కూల్​లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారు. ఉన్నత ప్రమాణాలతో విద్యనందించడంతో పాటు అత్యుత్తమమైన క్రీడా శిక్షణ, పౌష్టికాహారం అందిస్తారు. స్పోర్ట్స్​ స్కూళ్లలో విజయవంతంగా చదువు పూర్తి చేసుకున్న వారికి రైల్వే, ఆర్మీ, నేవి, ఎయిర్​ఫోర్స్​, పోలీస్​, ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​తో పాటు తదితర రంగాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

వెబ్​సైట్​: http://sats.telangana.gov.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!