HomeLATESTఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం ఈ 12 టిప్స్.. ఫుడ్ నుంచి ప్రాక్టీస్ వరకు.. అభ్యర్థులు...

ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం ఈ 12 టిప్స్.. ఫుడ్ నుంచి ప్రాక్టీస్ వరకు.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఈవెంట్స్ డేట్స్ ఖరారయ్యాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి ఈవెంట్స్ ను నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. ఈ మేరకు హాల్ టికెట్లను సైతం ఇప్పటికే విడుదల చేసింది. అయితే.. నియామక ప్రక్రియలో ఈవెంట్స్ అత్యంత ముఖ్యమైనవి కావడంతో అనేక మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. చాలా మంది రాత పరీక్షలో మెరిట్ ఉన్నా కూడా ఈవెంట్స్ లో క్వాలిఫై కాలేక ఉద్యోగాన్ని కోల్పోతుంటారు. ఈవెంట్స్.. అందులో ముఖ్యంగా రన్నింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ప్రయత్నిస్తే ఈవెంట్స్ ను సులువుగా సాధింవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారు చెప్పిన సూచనలివే..

Advertisement

– ఈవెంట్స్ కు ముందు శరీరానికి రెస్ట్ చాలా అవసరం. ఈవెంట్స్ కు వారం రోజుల ముందు నుంచే రోజూ రాత్రి 8 గంటలకే నిద్రపోవడం అలవాటు చేసుకోండి.
– ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్స్ కు ముందు రోజు రాత్రి నిద్రలేకుండా గడపవద్దు. ఇందు కోసం ముఖ్యంగా ఫోన్ ను దూరం ఉంచండి.
– సరిగా నిద్రలేకపోతే శరీరం మీకు సరిగ్గా సహకరించక ఈవెంట్స్ లో అర్హత సాధించడం ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంటుంది.
– ఈవెంట్స్ నిర్వహించే ప్రాంతానికి ఒక రోజు ముందుగానే చేరుకోండి. ఆ ప్రాంతంలో తెలిసిన వారు లేకపోతే హోటల్ లో అయినా.. ఉండి తగిన విశ్రాంతి తీసుకోండి.
– ఈవెంట్స్ రోజు మార్నింగ్ లైట్ ఫుడ్ తీసుకోండి. ఇడ్లీ బెటర్. పూరీ లాంటి ఫుడ్స్ తీసుకుంటే వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది.

– ఈవెంట్స్ కు ముందు రోజు వారం రోజుల ముందు నుంచి ఉదయం, సాయంత్రం ఒకేలాంటి ఆహారం తీసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, రాత్రి 8 గంటలకు పడుకోవడం అలవాటు చేసుకోండి.
– మీరు చేస్తే మీ శరీరం అందుకు తగినట్లుగా అలవాటు పడుతుంది. తద్వారా ఈవెంట్స్ రోజు ఎలాంటి టెన్షన్ లేకుండా సులువుగా అర్హత సాధించవచ్చు.
– ఈవెంట్స్ రోజు రన్నింగ్ కు అరగంట ముందు మూత్రం పోసి సిద్ధంగా ఉండండి. మొహవాటం పడి టాయిలెట్ కు వెళ్లకుండా ఉంటే ఇబ్బంది పడతారు.

– రన్నింగ్ చేసే సమయంలో ముందు, వెనక ఉన్న వాళ్లని అస్సలు పట్టించుకోవద్దు. అలా చేయడం ద్వారా టైం వేస్ట్ అవుతుంది. లక్ష్య సాధనలో ఇబ్బంది పడతారు.
– రోజూ ఈవెంట్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ లోనే రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్లండి. అలా కాకుండా వెంటనే ఇంటికి వెళ్తే తర్వాత పెయిన్స్ ఉండి ఇబ్బంది పడతారు.
– ఉదయం ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత ఈవెంట్స్ గురించిన ఆలోచన వద్దు. ప్రశాంతంగా చదువుకోండి.
– షాట్ పుట్ కు మూడు ఛాన్స్ లు ఉంటాయి. ఏదో ఒక అటెంప్ట్ లో అయినా మీరు అర్హత సాధిస్తే సరిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!