Homeవార్తలుఉద్యోగులకు 8% జీతాల పెంపు​: పీఆర్​సీ సిఫారసు.. నేడో రేపో వెల్లడి

ఉద్యోగులకు 8% జీతాల పెంపు​: పీఆర్​సీ సిఫారసు.. నేడో రేపో వెల్లడి

తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులకు.. పెన్షనర్లకు చేదువార్త.
కేవలం 8 శాతం ఫిట్​మెంట్​ ఇవ్వాలని తెలంగాణ తొలి పీఆర్​సీ సిఫారసు చేసింది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతకు మించి జీతాలను పెంచేది లేదని.. ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ముందుగానే వెల్లడించి ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్పందనను తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పీఆర్​సీ రిపోర్టును ముందుగా విడుదల చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. పీఆర్​సీ సిఫారసులను వెల్లడించటం ద్వారా ఆయా వర్గాల నుంచి వచ్చే వ్యతిరేకతను కొంతమేరకు కట్టడి చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది.

కమిషన్ ఏమేం సిఫారసులు చేసింది… ఎంత ఫిట్​మెంట్​ ఇవ్వాలని సూచించింది.. ఉద్యోగుల రిటైర్​మెంట్​ ఏజ్​, ప్రమోషన్లు, పనిభారం తగ్గింపుపై ఏమేం అభిప్రాయాలను వ్యక్తం చేసింది…? అనే వివరాలన్నీ వెల్లడించటం ద్వారా .. ప్రభుత్వం ఒకింత సేఫ్​ గేమ్​ ప్లాన్​ చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డిసెంబర్ 31న పీఆర్​సీ తమ నివేదికను సీఎస్​ సోమేష్​కుమార్​కు అందించింది. సీల్డ్‌ కవర్‌లో ప్రభుత్వం చేతికి అందిన ఈ నివేదికలో ఏముంది.. ఏమేం సిఫారసులున్నాయి.. ఎంత శాతం ఫిట్​మెంట్​ ఉంటుందనేది ఉద్యోగ వర్గాల్లో దాదాపు నెల రోజులుగా ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులతో చర్చలకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ చర్చలకు ముందే పీఆర్​సీ సిఫారసులను బయటపెట్టేందుకు.. పీఆర్​సీ రిపోర్టు వెయ్యి కాపీలు ముద్రించే ఏర్పాట్లు చేసింది. ఈ ప్రింటెండ్​ కాపీలను నేడో రేపో అన్ని విభాగాల అధిపతులకు పంపించనుంది. వీటినే ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలకు అందించనుంది.

ఈ రిపోర్టు అధ్యయనం చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లో సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఏపీలో ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు గత ఏడాది జులై లోనే 27 శాతం ఐఆర్​ ప్రకటించింది. అంతకు మించి ఫిట్​మెంట్​ ఉంటుందని ఆశలు పెంచుకున్న తెలంగాణ ఉద్యోగులకు నిరాశ ఎదురవనుంది. పీఆర్​సీ సిఫారసు చేసిన 8 శాతం ఫిట్​మెంట్​పై చర్చలు జరిపి.. చివరకు 12 శాతం మించకుండా ఫిట్​మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు మించి జీతాలు పెంచే ప్రసక్తి లేదని.. ఈసారి ఉద్యోగులకు నిరుత్సాహం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

RECENT POSTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!