HomeNCERT SOLUTIONS10th CLASSఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

రెగ్యులర్‌గా స్కూల్, కాలేజీలకు వెళ్లకుండా ఓపెన్ పద్ధతిలో చదువుకుంటున్న విద్యార్థులకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) కీలక అప్‌డేట్ అందించింది. ఇందులో భాగంగానే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభమై అక్టోబర్ 17 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ సబ్జెక్టుల వారీగా టైమ్ టేబుల్‌ను చెక్ చేసుకోవాలని సొసైటీ డైరెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి పూర్తి పరీక్షల షెడ్యూల్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

పరీక్షల టైమింగ్స్, సెషన్స్:
ఈ పరీక్షలను ప్రతి రోజూ రెండు విడతలుగా (రెండు సెషన్లలో) నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం సెషన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లలోని సబ్జెక్టుల తేదీలను బట్టి పరీక్షా కేంద్రానికి సరైన సమయానికి చేరుకోవాలి.

సబ్జెక్ట్ల వారీగా పరీక్షల షెడ్యూల్:

అక్టోబర్ 11: వొకేషనల్ సబ్జెక్టులు

అక్టోబర్ 12: టెన్త్ – తెలుగు|ఇంటర్ -తెలుగు, ఉర్దూ, హిందీ

అక్టోబర్ 13: పదో తరగతి,ఇంటర్ -ఇంగ్లీష్

అక్టోబర్ 14: టెన్త్ – మ్యాథ్స్|ఇంటర్ పొలిటికల్ సైన్స్ (పొలిటీ)

అక్టోబర్ 15: టెన్త్ – సైన్స్|ఇంటర్-కామర్స్

అక్టోబర్ 16: టెన్త్ – సోషల్ స్టడీస్|ఇంటర్-హిస్టరీ

అక్టోబర్ 17: టెన్త్ – ఎకనామిక్స్|ఇంటర్-ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్, జియాలజీ

అలాగే.. ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలను అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.పరీక్షలకు సంబంధించిన మరిన్ని తాజా వివరాలు లేదా హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయాలని సూచించారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here