తెలంగాణ కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా మరో వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మొత్తం 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతోందని మంత్రి అన్నారు.
ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 25 ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/ ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.