HomeLATESTతెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో మోడల్ స్కూల్స్ (Telangana Model Schools) కు మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ నాణ్యమైన విద్య అందుతుండడంతో ఇక్కడ అడ్మిషన్ (TS Model School Admissions) పొందేందుకు విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇక్కడ చేర్చేందుకు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా.. విద్యాశాఖ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు సంబంధించిన టెస్ట్ షెడ్యూల్ ను విడుదల చేసింది. రేపటి నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 8న ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేస్తామని తెలిపింది.

Advertisement

ఏప్రిల్ 16న అడ్మిషన్ టెస్ట్ ఉంటుందని ప్రకటించింది. ఆరవ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని వెల్లడించింది. 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపింది. మే 15న ఇందుకు సంబంధించిన పరీక్షా ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు అధికారులు.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://telanganams.cgg.gov.in/

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!