తెలంగాణ మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) నియామకాల ప్రొవిజినల్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ వివరాలను పరిశీలించి అభ్యంతరాలుంటే నమోదు చేసుకోవాలని ప్రకటన విడుదల చేసింది. ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలకు గడువు నిర్ణయించింది. అభ్యంతరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 2322 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఏడాది నవంబర్ 23న పరీక్ష నిర్వహించింది. మొత్తం 42,224 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయగా, 40,423 మంది పరీక్షకు హాజరయ్యారు. నవంబర్ 26న ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. ఫైనల్ కీతో పాటు ఫలితాలను మే 5వ తేదీన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ప్రతి అభ్యర్థి వివరాలను, ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను, వెయిటేజీ ద్వారా పొందిన మార్కులను లిస్ట్‌లో పొందుపర్చింది.ప్రతి అభ్యర్థి తాము పొందిన మార్కులు, ఇతర అంశాలను సరి చూసుకోవాలని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26 నుంచి సెప్టెంబర్2వ తేదీ లోపల తెలియజేయాలని సూచించింది.అభ్యంతరాల నమోదుకు ఈ నెల 26 నుంచి బోర్డు వెబ్‌సైట్‌లో సదుపాయం కల్పిస్తామని పేర్కొంది.

ముఖ్యాంశాలు
- పోస్టులు: 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
- అప్లై చేసిన వారు: 42,244 | పరీక్షకు హాజరైన వారు: 40,423
- ప్రిలిమినరీ కీ: 2024 నవంబర్ 26
- ఫైనల్ కీ & రిజల్ట్ (నార్మలైజేషన్‌తో): 2025 మే 5
- ప్రొవిజినల్ “Details of Applicants” విడుదల: ఆగస్ట్ 8
- అభ్యంతరాల విండో: ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 02 సాయంత్రం 5 గంటల వరకు
- CBT మార్కులు & వెయిటేజ్ మార్కులు తప్ప మిగతా వివరాలు బోర్డు ధృవీకరించలేదు; షార్ట్‌లిస్ట్ అయిన వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రమే ధృవీకరిస్తారు.
- హైకోర్టు పెండింగ్ రిట్ పిటిషన్లకు ఎంపికలు లోబడి ఉంటాయి.
అభ్యంతరాల నమోదుకు..
- MHSRB వెబ్‌సైట్‌లో మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
- “Details of Applicants/Objections” సెక్షన్ ఓపెన్ చేసి, మీ వివరాలు జాగ్రత్తగా పరిశీలించండి.
- అవసరమైన ఆధార పత్రాలన్నిటినీ ఒకే PDF ఫైల్‌గా కలిపి సిద్ధం చేసుకోండి.
- ఆన్‌లైన్ ఫారమ్‌లో ఒకసారి మాత్రమే అభ్యంతరం సమర్పించండి (మల్టిపుల్ submissions అనుమతి లేదు).
- డెడ్‌లైన్ ముందే సబ్మిట్ చేసి, అక్‌నాలెడ్జ్‌మెంట్ కాపీ సేవ్ చేసుకోండి.





