తెలంగాణ ప్రభుత్వం, ఉపాధి- శిక్షణ కమిషనర్, హైదరాబాద్ 2024–25 సెషన్‌కు గాను రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో ఐదో విడత ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్ 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో మొత్తం 65 ఐటీఐలున్నాయి.
ట్రేడ్: కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితరాలు.
అర్హత: ట్రేడును అనుసరించి 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత. వయసు 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. అకడమిక్ మెరిట్/ గ్రేడింగ్ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 28 వరకు అప్లై చేసుకోవాలి. వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్ వివరాలను ప్రాధాన్యతా క్రమంలో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐ కళాశాల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఆయా కళాశాలల్లో 25-09-2024 నుంచి 28-09-2024 వరకు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావచ్చు. పూర్తి వివరాలకు www.iti.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.