టెన్త్ పూర్తయిన తర్వాత మంచి ఉపాధి కోర్సులు చేయాలని చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో వివిధ ట్రేడ్లలో చేరడానికి అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు కోరుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో సీట్లు రానివారు లేదా గ్లైడింగ్ ద్వారా మెరుగైన సీటు కోరుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
కోర్సులు, ట్రేడ్లు:
నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) గుర్తింపు పొందిన కోర్సులను ఈ అడ్మిషన్ల ద్వారా అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), 63 ప్రభుత్వ ఐటీఐలు, ,200 ప్రైవేట్ ఐటీఐలలో సుమారు 47 రకాల ట్రేడ్లలో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కేవలం సాంప్రదాయ ట్రేడ్లే కాకుండా నేటి డిజిటల్ యుగానికి తగినట్లుగా ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, వెల్డర్, ప్లంబర్ వంటి వాటితో పాటు ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ ఎలక్ట్రిక్ వెహికల్, డ్రోన్ టెక్నీషియన్, ఫ్యాషన్ డిజైన్ వంటి లేటెస్ట్ ట్రేడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు, వయోపరిమితి:
విద్యార్హత: తెలంగాణ స్టేట్ బోర్డ్ లేదా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్ వంటి గుర్తింపు పొందిన బోర్డుల నుంచి టెన్త్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని ప్రత్యేక ట్రేడ్లకు నిర్దిష్టమైన అర్హతలు ఉంటాయి. అయితే.. టెన్త్ పాస్ అయిన వారికి మొదటి ప్రాధాన్యత లభిస్తుంది.
వయోపరిమితి: అభ్యర్థులకు ఆగస్టు 1 నాటికి కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలి. ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ కోర్సులో చేరాలనుకునేవారికి కనీసం 16 సంవత్సరాలు ఉండాలి. ఈ అడ్మిషన్లకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు, కాబట్టి ఆసక్తి ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ విధానం:
ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొంది, మరింత మెరుగైన కాలేజీ లేదా.. ట్రేడ్ కోరుకునే అభ్యర్థులు ‘గ్లైడింగ్’ పద్ధతి ద్వారా మళ్లీ కొత్త ఆప్షన్లను పెట్టుకోవచ్చు. మొదటిసారి అప్లై చేసేవారు.. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే అప్లికేషన్ పూర్తి చేయాలి.
1.ముందుగా అధికారిక పోర్టల్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
2.ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు, రిజర్వేషన్ కేటగిరీని ఎంటర్ చేయాలి.
3.టెన్త్ మెమో, కాస్ట్ సర్టిఫికెట్, ఫొటో, సంతకం వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
4.మీకు నచ్చిన ఐటీఐలు, ట్రేడ్లను ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లుగా ఎంచుకోవాలి.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగస్టు 6 నుంచి ఆగస్టు 15 వరకు ఉంటుంది.
ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆగస్టు 8 నుంచి ఆగస్టు 17 వరకు కొనసాగుతుంది.
సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆగస్టు 20 నుంచి ప్రారంభమవుతుంది.
ఎంపికైన అభ్యర్థులు కాలేజీలో రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 24 వరకు గడువు ఇచ్చారు.





