తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 23 లేదా 24 నుంచి పరీక్షలు మొదలయ్యేలా ఇంటర్ బోర్డు టైమ్ టేబుల్‌ను సిద్ధం చేసింది. సీఎం, విద్యాశాఖ ఆమోదం తర్వాత ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఏపీ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 27న ప్రారంభమై మార్చి 24 తో ముగియనున్నాయి. అదే విధంగా తెలంగాణలోనూ ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వాస్తవానికి గతంలో ఫిబ్రవరి నెలాఖరులోనే పరీక్షలు నిర్వహించారు. కరోనా ప్రభావంతో మార్చికి షెడ్యూల్ మారింది. ఫిబ్రవరిలోనే పరీక్షలు మొదలు పెడితే.. జేఈఈ మెయిన్స్, ఎంసెట్ వంటి వాటికి సన్నద్ధమయ్యే విద్యార్థులకు కొంత వెసులుబాటు ఉంటుందని బోర్డు భావిస్తోంది. ఉదాహరణకు.. గతంలో మార్చి 15న ఇంటర్ పరీక్షలు మొదలై.. జేఈఈ మెయిన్ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యారు. అందుకే పరీక్షలు ముందుగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఫీజుల పెంపు ప్రతిపాదన: పరీక్షల ఫీజు పెంచాలని ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి.. ప్రతిపాదించింది.
ప్రస్తుత ఫీజు: ప్రస్తుతం ప్రాక్టికల్స్‌తో కలిపి దాదాపు రూ. 1100 చెల్లించాల్సి ఉంటుంది.
ఆమోదం లభిస్తే: ప్రభుత్వం ఆమోదిస్తే.. ప్రాక్టికల్స్ లేని కోర్సులకు దాదాపు రూ.880, ప్రాక్టికల్స్ ఉన్నవాటికి రూ. 1500 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.





