Homeవార్తలుటీఎస్‌డబ్ల్యూఆర్‌ సైనిక్‌ స్కూల్‌లో ఇంటర్‌ అడ్మిషన్స్​

టీఎస్‌డబ్ల్యూఆర్‌ సైనిక్‌ స్కూల్‌లో ఇంటర్‌ అడ్మిషన్స్​


తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) 2022-–2023 విద్యాసంవత్సరానికి కరీంనగర్‌ జిల్లా, రుక్మాపూర్‌ టీఎస్‌డబ్ల్యూఆర్‌ సైనిక్‌ స్కూల్‌ (సీబీఎస్‌ఈ-బాయ్స్‌)లో ఇంటర్మీడియట్​లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement

అర్హత: మొత్తం 80 సీట్లు ఉన్నాయి ఎంపీసీ బ్రాంచ్ విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామాల్లో రూ.1,50,000, పట్టణాల్లో రూ.2,00,000 మించకుండా ఉండాలి. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న లేదా ఉత్తీర్ణులైన బాలురు అర్హులు. వయసు16 ఏళ్లు మించకుండా ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష, స్క్రీనింగ్‌ టెస్టులు (ఫిజికల్‌/ పర్సనాలిటీ/ ఇంటర్వ్యూ/ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌), మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత పరీక్షను మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 180 నిమిషాలు ఉంటుంది.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రూ. 200 ఫీజు చెల్లించి, మార్చి 21 వరకు అప్లై చేసుకోవాలి. ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష 27 మార్చిలో నిర్వహిస్తారు. మరింత సమాచారం కోసం www.tswreis.ac.in వెబ్​సైట్​ సంప్రదించాలి.

Advertisement

ఆరోతరగతిలో అడ్మిషన్స్​

హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) 2022–-2023 విద్యాసంవత్సరానికి కరీంనగర్‌ జిల్లా, రుక్మాపూర్‌ టీఎస్‌డబ్ల్యూఆర్‌ సైనిక్‌ స్కూల్‌ (సీబీఎస్‌ఈ-బాయ్స్‌)లో ఆరో తరగతిలో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: మొత్తం 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐదో తరగతి చదువుతున్న/ ఉత్తీర్ణులైన బాలురు అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామాల్లో రూ.1,50,000, పట్టణాల్లో రూ.2,00,000 మించకుండా ఉండాలి. వయసు11 ఏళ్లు మించకుండా ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష, స్క్రీనింగ్‌ టెస్టులు (ఫిజికల్‌/ పర్సనాలిటీ/ ఇంటర్వ్యూ/ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌), మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది.

Advertisement

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో రూ.200 చెల్లించి మార్చి 21 వరకు అప్లై చేసుకోవాలి. పరీక్ష మార్చి 27న నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.tswreis.ac.in వెబ్​సైట్​ సంప్రదించాలి.

RECENT POSTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!