HomeEXAMS RESULTSINTERఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పేరెంట్స్ వాట్సాప్‌కే హాల్ టికెట్స్

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పేరెంట్స్ వాట్సాప్‌కే హాల్ టికెట్స్

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) 2026 వార్షిక పరీక్షల నిర్వహణలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల హాల్ టికెట్లను నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపాలని నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడం, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

పరీక్షా కేంద్రానికి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్లలో తప్పులు గమనించి కంగారు పడకుండా ఉండేందుకు బోర్డు ఈ ‘ప్రివ్యూ’ సౌకర్యాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ పంపించనున్నారు. దీని ద్వారా వివరాలను ముందుగానే సరి చూసుకోవచ్చు.

డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా ?
విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఫస్ట్ ఇయర్ (1st Year): SSC రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సెకండ్ ఇయర్ (2nd Year): ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

తప్పులు ఉంటే ఏం చేయాలి ?
ఒకవేళ హాల్ టికెట్‌లో పేరు, ఫోటో, సంతకం, సబ్జెక్టులు లేదా మీడియం వంటి వివరాల్లో పొరపాట్లు ఉంటే.. వెంటనే సంబంధిత కాలేజీల ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సరి చేసుకోవాలని బోర్డు సూచించింది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ టైమ్ టేబుల్ :

25-02-2026 పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్)
27-02-2026 పార్ట్ 2 (ఇంగ్లీష్ పేపర్-1)
02-03-2026 మ్యాథ్స్-1A, బోటనీ, పొలిటికల్ సైన్స్
05-03-2026 మ్యాథ్స్-1B, జువాలజీ, హిస్టరీ
09-03-2026 ఫిజిక్స్, ఎకానమిక్స్
12-03-2026 కెమిస్ట్రీ, కామర్స్
17-03-2026 మోడ్రన్ లాంగ్వేజ్-1, జియోగ్రఫీ-1

సెకండ్ ఇయర్ టైమ్ టేబుల్ :

26-02-2026 పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్)
28-02-2026 పార్ట్ 1 (ఇంగ్లీష్ పేపర్-2)
04-03-2026 మ్యాథ్స్-2A, బోటనీ, పొలిటికల్ సైన్స్
06-03-2026 మ్యాథ్స్-2B, జువాలజీ, హిస్టరీ
10-03-2026 ఫిజిక్స్, ఎకానమిక్స్
13-03-2026 కెమిస్ట్రీ, కామర్స్
16-03-2026 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్-2
18-03-2026 మోడ్రన్ లాంగ్వేజ్-2, జియోగ్రఫీ-2

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here