తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌తో పాటు పరీక్షల విధానంలో భారీ మార్పులు తీసుకువచ్చింది. విద్యార్థులు కేవలం బట్టీ పద్ధతికి స్వస్తి పలికి, అప్లైడ్ లెర్నింగ్ నేర్చుకునేలా రాత పరీక్షలు ,ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. సబ్జెక్టుల వారీగా మారిన కొత్త మార్కుల వెయిటేజీ, పరీక్షా సరళికి సంబంధించిన పూర్తి వివరాలు.
రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విప్లవాత్మక మార్పులు అమలుకానున్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు, బట్టీ విధానానికి స్వస్తి పలకడానికి ఇంటర్ బోర్డు ఈ నూతన పరీక్షల విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు కార్యదర్శి తెలిపారు.
- 80-20 మార్కుల కొత్త ఫార్ములా:
ఇప్పటివరకు ఉన్న పాత విధానాన్ని మార్చి, ప్రధాన సబ్జెక్టుల్లో రాత పరీక్షకు 80 శాతం, ఇంటర్నల్ అసెస్మెంట్ లేదా ప్రాక్టికల్స్‌కు 20 శాతం మార్కులను కేటాయించారు.
పాస్ మార్కులు:
రాత పరీక్ష 80 మార్కులకు గాను కనీసం 28 మార్కులు (35 శాతం), అలాగే.. ప్రాక్టికల్స్/ఇంటర్నల్స్ 20 మార్కులకు గాను కనీసం 7 మార్కులు సాధిస్తేనే విద్యార్థులు పాసైనట్లు .
- సబ్జెక్ట్‌ల వారీగా మార్కుల కేటాయింపు:
ఆర్ట్స్, కామర్స్ & లాంగ్వేజెస్: హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ వంటి భాషా సబ్జెక్టులకు రాత పరీక్షను 100 నుంచి 80 మార్కులకు తగ్గించారు. మిగిలిన 20 మార్కులను.. ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా ఇస్తారు.
గణితం: మ్యాథ్స్ 1A, 1B పేపర్లలో.. రాత పరీక్షను 75 నుంచి 60 మార్కులకు కుదించారు. మిగిలిన 15 మార్కులను యాక్టివిటీ.. బేస్డ్ లెర్నింగ్ రూపంలో కేటాయిస్తారు (రెండు పేపర్లు కలిపి మొత్తం 30 మార్కులు).
సైన్స్ గ్రూప్స్ & ఇంగ్లీష్: సైన్స్ సబ్జెక్టుల్లో.. ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యతనిచ్చారు.అలాగే ఆంగ్ల సబ్జెక్టులో.. ఫస్టియర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రాక్టికల్ మాన్యువల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు.
- కామన్ వాలిడేషన్ రూల్స్:
ఈ కొత్త విధానం రాష్ట్రంలోని.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఒకేలా పారదర్శకంగా అమలయ్యేందుకు ప్రత్యేకంగా ‘కామన్ వాలిడేషన్ రూల్స్’ జారీ చేశారు. ఇంటర్నల్ మార్కుల కేటాయింపు, రికార్డులపై ప్రిన్సిపల్స్,ఫ్యాకల్టీకి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసేందుకు ఎఫ్ఏక్యూలు కూడా అందుబాటులో ఉంచారు.





