తెలంగాణా లో ఇంటిగ్రేటెడ్ బీ ఈ డీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల అయింది.రెగ్యులర్ డిగ్రీతో పాటు బీఈడీ చదివేందుకు వీలుగా రూపొందించిన ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. 2021-22 విద్యా సంవత్సరానికి బీఎస్సీ బీఈడీ, బీ ఏ బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ కోర్సులో చేరేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్ మీడియెట్ లేదా తత్సమాన అర్హత కలిగిన విద్యార్థులందరూ ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 24 నుంచి ప్రారంభమవుతాయని తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాలు అఫిషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
