HomeLATESTఇన్-సర్వీస్ టెట్ ఫలితాలు విడుదల..స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా!

ఇన్-సర్వీస్ టెట్ ఫలితాలు విడుదల..స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా!

తెలంగాణలో.. ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇన్-సర్వీస్ టెట్ (TET) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ నెలలో జరిగిన ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు సంబంధించి ఉపాధ్యాయులు తమ మార్కుల వివరాలను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. పాఠశాల విద్య శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో టెట్ ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.

సెప్టెంబర్ 8, 9 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో ఈ టెట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 24,986 మంది ఉపాధ్యాయులు అప్లై చేసుకోగా, వారిలో 22,477 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ మూల్యాంకన ప్రక్రియ పూర్తి కాగా.. మొత్తం 15,749 మంది అభ్యర్థులు ఈ పరీక్షల్లో అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.

విభాగాల వారీగా చూస్తే.. పేపర్-1 లో 68.76 శాతం మంది అభ్యర్థులు పాస్ కాగా, పేపర్-2 మ్యాథ్స్ , సైన్స్ విభాగంలో అత్యధికంగా 73.60 శాతం మంది అర్హత సాధించారు. అలాగే పేపర్-2 సోషల్ స్టడీస్ విభాగంలో.. 67 శాతం మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణులైనట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.

స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం:

  1. ముందుగా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in ఓపెన్ చేయండి.
  2. హోమ్‌పేజీలో కనిపించే ‘TS TET ‘In-Service Teachers’ అనే లింక్ పై క్లిక్ చేయండి.
  3. తర్వాత ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీ హాల్ టికెట్ నంబర్, అడిగిన ఇతర వివరాలను (పుట్టిన తేదీ వంటివి) ఎంటర్ చేయండి.
  4. అన్ని వివరాలు చెక్ చేసిన తర్వాత ‘Submit’ లేదా ‘Get Results’ పై క్లిక్ చేయండి. వెంటనే స్క్రీన్ పై స్కోర్ కార్డ్ కనిపిస్తుంది.
  5. చివరగా మీ స్కోర్ కార్డ్‌ను Download లేదా Print ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోండి.
RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here