తెలంగాణ ఇంటిగ్రేటేడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG ICET–2025) పరీక్షలు జూన్ 8 మరియు 9 తేదీల్లో జరగనున్నాయి. రాష్ట్రంలోని కాలేజీల్లో MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు ఈసారి 71,757 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 34,409 మంది పురుషులు కాగా, 37,331 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షను ఈసారి నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్శిటీ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 16 జోన్లలో 96 టెస్ట్ సెంటర్లలో పరీక్ష కేంద్రాలున్నాయి.
- 08 జూన్ 2025 (శనివారం)
- ఉదయం 10 నుండి 12:30
- మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:00
- 09 జూన్ 2025 (ఆదివారం)
- ఉదయం 10 నుండి 12:30
హాల్ టికెట్ డౌన్‌లోడ్:
అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ https://icet.tgche.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్‌పై ఇచ్చిన సూచనలను అభ్యర్థులు తప్పకుండా పాటించాలి. హాల్ టికెట్‌లో ఇచ్చిన QR కోడ్ స్కాన్ చేసి పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందే రూట్ మ్యాప్ తెలుసుకోవచ్చు.






