HomeLATESTతెలంగాణ హైకోర్టులో స్టెనోగ్రాఫర్​ జాబ్స్​

తెలంగాణ హైకోర్టులో స్టెనోగ్రాఫర్​ జాబ్స్​

రాష్ట్రంలోని ఆదిలాబాద్​, ఖమ్మం, కరీంనగర్​, మహబూబ్​నగర్​, మెదక్​, నిజామాబాద్​, నల్గొండ, రంగారెడ్డి జిల్లా కోర్టులతో పాటు హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ సెషన్స్​ కోర్టు, సిటీ సివిల్​ కోర్టులో స్టెనోగ్రాఫర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది.

Advertisement

అర్హత: మొత్తం 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ టైప్​ రైటింగ్​ బై హయ్యర్​ గ్రేడ్ ( 45 వర్డ్స్​ ఫర్​ మినట్​) లేదా షార్ట్​ హాండ్​ బై హయ్యర్​ గ్రేడ్​ ( 120 వర్డ్​ ఫర్ మినట్​) లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూఎస్​ క్యాండిడేట్స్​కు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్​ 4వ తేదీ లోపు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 400 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి.

సెలెక్షన్​ ప్రాసెస్: రాతపరీక్ష, స్కిల్​ టెస్ట్​, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాతపరీక్ష 25 మార్కులు జనరల్ నాలెడ్జ్​, 25 మార్కులు జనరల్​ ఇంగ్లిష్​ నుంచి మొత్తం 50 మార్కులకు ఉంటుంది. పరీక్షకు 60 నిమిషాల సమయం కేటాయించారు. క్వశ్చన్​ పేపర్​ ఇంగ్లిష్​, తెలుగు మీడియంలో ఉంటుంది. 30 మార్కులు స్కిల్​ టెస్ట్ ( స్టెనోగ్రఫీ), 20 మార్కులు ఇంటర్వ్యూకి ఉంటుంది.

Advertisement

వెబ్​సైట్​: www.tshc.gov.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!