తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం. తాజాగా తెలంగాణ హైకోర్టు 34 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. అదేవిధంగా జిల్లా కోర్టుల్లో డ్రైవర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రభుత్వ సర్వీసులో స్థిరపడాలనుకునే 7వ తరగతి నుంచి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ విధానం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ రిక్రూట్‌మెంట్ 2026:
తెలంగాణ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా.. 34 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (No. 101/2026) విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 34
జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,000 నుంచి రూ. 58,850 వరకు జీతం ఇస్తారు.
విద్యార్హత: 7వ తరగతి నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. (10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వారు ఈ పోస్టులకు అనర్హులు).
వయస్సు: 01-07-2026 నాటికి అభ్యర్థుల వయస్సు18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. (SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది).
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: మే నెలలో పరీక్ష నిర్వహిస్తారు.
- తెలంగాణ జిల్లా కోర్టు డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 2026:
హైకోర్టు పరిధిలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 09 డ్రైవర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ (No. 102/2026) వెలువడింది.
మొత్తం ఖాళీలు: 09
విద్యార్హత: టెన్త్ఉత్తీర్ణతతో పాటు తెలుగు/ఉర్దూ/హిందీ లేదా ఇంగ్లీష్ చదవడం, రాయడం తెలిసి ఉండాలి. చెల్లుబాటు అయ్యే LMV (Light Motor Vehicle) డ్రైవింగ్ లైసెన్స్, కనీసం 3 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం తప్పనిసరి.
వయస్సు: అభ్యర్థులు 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్లికేషన్ విధానం: ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లై చేయడం ఎలా?
ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ tshc.gov.in లోకి లాగిన్ అయ్యి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.





