తెలంగాణ హైకోర్టు (TGHC)66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. న్యాయ విద్య పూర్తి చేసిన, న్యాయమూర్తులుగా స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి అవకాశం. ఈ పోస్టుల కోసం అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. అభ్యర్థులు డిసెంబర్ 8 నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్‌లకు డిసెంబర్ 29 రాత్రి 11:59 గంటల వరకు గడువు ఉంది. అభ్యర్థులు ఈ గడువులోగా తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్లు పూర్తి చేయాలి.
నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ సివిల్ జడ్జి పోస్టులకు సంబంధించిన నియామక పరీక్ష తేదీలు, సమయం, హాల్ టికెట్ డౌన్‌లోడ్ వివరాలు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆధారంగా ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, ఇతర మార్గదర్శకాలను తెలుసుకోవడం కోసం అభ్యర్థులు హైకోర్టు వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.





