Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఈ నెలలోనే భారీ గురుకుల జాబ్స్ నోటిఫికేషన్..

ఈ నెలలోనే భారీ గురుకుల జాబ్స్ నోటిఫికేషన్..

తెలంగాణలో అత్యధిక మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లలో టీచర్ జాబ్స్ (Teacher Jobs) ఒకటి. నిత్యం రెండు, మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్న ఈ తరుణంలో టీచర్ ఉద్యోగాలకు, అందులో ముఖ్యంగా గురుకుల ఉద్యోగాల ప్రకటన విడుదల కాకపోవడంతో ఆయా అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో దాదాపు 9,256 ఖాళీల (TS Gurukul Jobs) భర్తీకి కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. గతంలోనే మంజూరైన ఈ పోస్టులకు సంబంధించిన గుర్తింపు ప్రక్రియ ఇటీవలే పూర్తి కావడంతో నోటిఫికేషన్ విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంజూరైన మొత్తం 9,256 ఖాళీల్లో 546 స్టాఫ్‌ నర్సు పోస్టులు ఉన్నాయి. ఈ స్టాఫ్‌ నర్స్ పోస్టులను రాష్ట్ర మెడికల్‌ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్నారు.

Advertisement


Read This: టీఎస్పీఎస్సీ నుంచి మరో 4 నోటిఫికేషన్లు.. నిరుద్యోగులకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్

మిగతా 8,710 పోస్టులు తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TREIRB) ద్వారా భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఈ పోస్టుల్లో అత్యధికంగా మహాత్మ జ్యోతిభాపూలే బీసీ వెల్ఫేర్‌ విద్యాసంస్థల్లో 3,673, సోషల్‌ వెల్ఫేర్‌లో 2,143, ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 1,440, మైనారిటీలో 1,318, ట్రైస్‌లో 93, దివ్యాంగుల వెల్ఫేర్‌లో 43 పోస్టులు ఉన్నాయి. ఇంకా.. బీసీ గురుకులాల్లో గతంలోనే గుర్తించిన దాదాపు 3 వేల పోస్టులను కూడా వీటితో పాటే భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల అవుతుందని అధికార వర్గాల నుంచి సమాచారం. ఏదైనా కారణాల రిత్యా ఆలస్యమైనా ఈ నెలాఖరులోగా ప్రకటన తప్పక వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!