తెలంగాణలో అత్యధిక మంది నిరుద్యోగులను ఊరిస్తున్న ఉద్యోగాల్లో గురుకులకు సంబంధించని నియామకాలు ఒకటి. ఇందుకు సంబంధించి ఇప్పటికే 9వేలకు పైగా ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో ఈ ఉద్యోగాల భర్తీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పోస్టుల భర్తీకి సంబంధించి గురుకుల విద్యాసంస్థల నుంచి నియామక బోర్డుకు ఇండెంట్లు(ప్రతిపాదనలు) అందాయి. ఈ ప్రతిపాదనల మేరకు పోస్టుల వారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాలు పరిశీలించేందుకు నియామక బోర్డు సిద్ధమైంది. ఈ భర్తీ బాధ్యతలను ప్రభుత్వం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు అప్పగించింది. వారం రోజుల్లో ఈ బోర్డు ప్రతిపాదనలు పరిశీలించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు అదనంగా మరో 3 వేల పోస్టులు చేరనున్నాయి. 2022-23 విద్యాసంవత్సరానికి మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పోస్టుల మంజూరుకు సంబంధించిన ఫైల్ పై సీఎం సంతకం చేసి.. బీసీ సంక్షేమ శాఖకు పంపించారు. ఈ ఖాళీలను కూడా కలిపి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీంతో దాదాపు 12 వేలకుపైగా ఖాళీల భర్తీకి వారం లేదా పది రోజుల్లో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందిన ఖాళీలు..
- బీసీ గురుకులం- 3870
(అదనంగా మరో 3వేల పోస్టులు రానున్నాయి.) - ఎస్సీ గురుకులాలు- 2267
- ఎస్టీ గురుకులాలు-1514
- మైనార్టీ గురుకులాలు-1445
Any information undate me