తెలంగాణ గ్రూప్-2 (TGPSC GROUP 2) ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ జాబితాతో పాటు ఫైనల్ కీ ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను సైతం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పెట్టింది. ప్రభుత్వ శాఖల్లో 783 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది.
గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 15,16న జరిగిన ఈ పరీక్షలను సుమారు 2.5 లక్షల మంది రాశారు. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన ప్రొవిజినల్ మార్కుల వివరాలను మార్చి 10 వ తేదీన టీజీపీఎస్సీ ప్రకటించింది. మరుసటి రోజునే గ్రూప్ 2 జీఆర్ఎల్, ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లను విడుదల చేసింది.
తెలంగాణ గ్రూప్ 2 ఫలితాల విడుదల
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS