తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఈ నియామక ప్రక్రియ చేపడుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబోరేటరీ టెక్నీషియన్, ల్యాబోరేటరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. 13 వివిధ రకాల పోస్టులున్నాయి. పోస్టుల వారీగా పీజీ, డిగ్రీ, ఇంటర్ విద్యార్హతలున్నాయి. అర్హులైన అభ్యర్థులు https://www.tgprb.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
నవంబర్ 27వ తేదీ నుంచి అప్లికేషన్లు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 17వ తేదీ అప్లికేషన్లకు తుది గడువు. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును కూడా ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాలి. దరఖాస్తు సమయంలో విద్యార్హతల ధ్రువీకరణపత్రాలతో పాటు పాస్ పోర్టు, సంతకాన్ని అప్ లోడ్ చేయాలి.
30 మార్కులకు రాత పరీక్ష, విద్యార్హతల్లో సాధించిన ఉత్తీర్ణతకు 70 శాతం మార్కులుంటాయి. రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలను https://www.tgprb.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వివరాల పీడీఎఫ్ ఇక్కడ అందుబాటులో ఉంది.
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 60 ఉద్యోగాలు
RELATED ARTICLES
PRACTICE TEST
TELANGANA HISTORY
CURRENT AFFAIRS
TELANGANA MAGAZINE
తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.





