తెలంగాణలో భారీగా ఉద్యోగాల జాతర కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్-1, 2, 3, 4 కు సంబంధిచిన అన్ని ప్రకటనలతో పాటు అనేక నోటిఫికేషన్లు వచ్చేశాయి. పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రెండు దశలు సైతం పూర్తి అయ్యాయి. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మరో ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో 166 ఖాళీల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. ఈ నియామక ప్రక్రియ నిర్వహణ భర్తీని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా చేపట్టనున్నట్లు తెలిపింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావడంతో టీఎస్పీఎస్సీ నుంచి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ 41
2. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 16
3. ఎడిటర్ (ఉర్దూ) 01
4. ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ 22
5. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 04
6. పబ్లిసిటీ అసిస్టెంట్ 82
మొత్తం: 166