HomeLATESTతెలంగాణలో కాంట్రాక్ట్ జాబ్స్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్.. అప్లికేషన్ ఫామ్ ఇదే..

తెలంగాణలో కాంట్రాక్ట్ జాబ్స్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్.. అప్లికేషన్ ఫామ్ ఇదే..

తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కార్యాలయం, హైదరాబాద్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Telangana Job Notification) విడుదల చేసింది. మొత్తం 114 ఖాళీలను (Telangana Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇంట్రెస్టు ఉన్న అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది.

Advertisement

ఖాళీల వివరాలు:

  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో 59 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.58,850 వేతనం ఉంటుంది.
  • డెంటల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో 01 ఖాళీ ఉంది. ఎంపికైన వారికి నెలకు రూ.58,850 వేతనం ఉంటుంది.
  • ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో 11 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.31,040 వేతనం ఉంటుంది
  • ఫార్మసిస్ట్ విభాగంలో 43 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.31,040 వేతనం ఉంటుంది.

నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ పీడీఎఫ్:

విద్యార్హతలు: పోస్టుల ఆధారంగా.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ విద్యార్హత కలిగిన వారు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయోపరిమితి 18-44 ఏళ్లు.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా:
జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్ , అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పటల్, సనత్ నగర్, నాచారం, హైదరాబాద్.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!