తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఎప్పుడెప్పుడా అంటూ లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన కీలక ప్రకటన రానే వచ్చేసింది. మొత్తం 9,168 గ్రూప్-4 ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది.
ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. అభ్యర్థులకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. గ్రూప్-4 ఖాళీలతో పాటు తెలంగాణ ఆర్థిక శాఖ తాజాగా మరో 42 ఖాళీల ఉద్యోగాల భర్తీకి సైతం అనుమతులు మంజూరు చేసింది.
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోని 42 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులను కొద్ది సేపటి క్రితం జారీ చేసింది ఆర్థిక శాఖ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.
Instead