తెలంగాణ ప్రభుత్వం సమాచార, ప్రజా సంబంధాల (ఐ అండ్ పీఆర్) శాఖలో వివిధ సర్వీసులకు ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 150 పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గురువారం సంబంధిత ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ పోస్టుల కోసం ఎంపికైన వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల్లో సుమారు ఒక సంవత్సరం పాటు సేవలందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం.. ఈ ఉద్యోగుల వేతనాలు థర్డ్ పార్టీ సంస్థల ద్వారా చెల్లిస్తారు. వీరు సంబంధిత జోన్‌లలో పర్యవేక్షణ నిర్వహిస్తూ, వివిధ కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు. ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు, నియామక విధానం త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపారు.