Homeస్టడీతెలంగాణవిజయ్ విహార్ జింకల పార్కు ఎక్కడ ఉంది?

విజయ్ విహార్ జింకల పార్కు ఎక్కడ ఉంది?

 • తెలంగాణ రాష్ట్ర వైశాల్యం – 1,12,077 చదరపు కిలోమీటర్లు. ఇందులో అడవులు 27,291 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఇది రాష్ట్ర వైశాల్యంలో 24.04 శాతం మాత్రమే. దేశంలో అటవీ విస్తీర్ణంపరంగా రాష్ట్రం 12వ స్థానాన్ని కలిగి ఉంటే, దేశ అటవీ విస్తీర్ణంలో 4.20శాతం కలిగి ఉంది.
 • రాష్ట్రంలో విస్తరించి ఉన్న అడవుల్లో రిజర్వ్ అడవులు 75.65 శాతం ఉండగా, రక్షిత అడవులు 22.07శాతం, వర్గీకరించని అడవులు 2.28శాతం ఉన్నాయి. రాష్ట్ర తలసరి అటవీ విస్తీర్ణత 0.082 హెక్టార్లు కాగా, దేశంలో 0.024 హెక్టార్లుగా ఉంది.
 • దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం మధ్యప్రదేశ్ ఇక్కడ 77,414 చ.కి.మీ మేర అడవులు విస్తరించి ఉన్నాయి. అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం హర్యానా(1588 చ.కి.మీ).
 • రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అత్యధిక అటవీ విస్తీర్ణం(4505చ.కి.మీ)తో మొదటి స్థానంలో ఉంది. రాజధాని హైదరాబాద్ మాత్రం కేవలం 1.43 చ.కి.మీలతో అతి తక్కువ అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉంది.
 • అటవీ సాంద్రత పరంగా చూసుకుంటే దేశంలో అత్యధిక అటవీ సాంద్రత గల రాష్ట్రం మిజోరం(86.27శాతం)కాగా, అత్యల్ప అటవీ సాంద్రత గల రాష్ట్రం హర్యానా(3.59శాతం).
 • రాష్ట్రంలో చూసుకుంటే అత్యధిక అటవీ సాంద్రత గల జిల్లా జయశంకర్ భూపాలపల్లి, అత్యల్ప అటవీ సాంద్రత గల జిల్లా కరీంనగర్, హైదరాబాద్.
 • వర్షపాత పరిమాణాన్ని బట్టి రాష్ట్రంలోని అడవులను 3 రకాలుగా వర్గీకరించారు.
 • ఆర్ధ్ర ఆకురాల్చు అడవులు
  • ఇవి వర్షపాతం 125 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైన వృక్షజాతులు ఏగిస, సాల్, టేకు, వెదురు, మోదుగ, బ్యాంబు, దరిసెన మొదలైనవి పెరుగుతాయి.
 • ఆనార్ధ్ర ఆకురాల్చు అడవులు
  • రాష్ట్రంలో అధిక మొత్తంలో విస్తరించి ఉన్న అడవులు ఆనార్ధ్ర ఆకురాల్చు అడవుల రకానికి చెందినవే. ఇవి 75 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే ప్రాంతాలలో పెరుగుతాయి. ఇవి ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవులలో పెరిగే ముఖ్యమైన వృక్షజాతులు టేకు, వెదురు, మద్ది, బూరుగ, వేప, మోదుగ మొదలైనవి.
 • చిట్ట అడవులు
  • ఇవి 50 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా ఇవి వికారాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఈ అరణ్యాలలో ముఖ్యంగా బ్రహ్మజెముడు, నాగజెముడు, తుమ్మ లాంటి ముళ్ల జాతులు పెరుగుతాయి.
 • రాష్ట్రంలో 12 రక్షిత అటవీ ప్రాంతాలు, 9 వన్య మృగ సంరక్షణ కేంద్రాలు(అభయారాణ్యాలు), 3 జాతీయ పార్కులున్నాయి.

వన్య మృగ సంరక్షణ కేంద్రాలు

 • సంరక్షణ కేంద్రం పాత జిల్లా కొత్త జిల్లా ప్రత్యేకత
 • మంజీరా అభయారణ్యం మెదక్ సంగారెడ్డి మొసళ్లు, తాబేళ్లు
 • ఏటూరు నాగారం వరంగల్ జయశంకర్ భూపాలపల్లి అడవి దున్నలు
 • శివరాం అభయారణ్యం ఆదిలాబాద్ మంచిర్యాల మగ్గర్ మొసళ్లు
 • కిన్నెరసాని ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అడవి దున్నలు,జింకలు
 • పోచారం నిజామాబాద్ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి నాలుగుకొమ్ముల జింక
 • కవ్వాల్ ఆదిలాబాద్ నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ పులులు
 • ప్రాణహిత ఆదిలాబాద్ మంచిర్యాల కృష్ణ జింకలు
 • పాకాల వరంగల్ వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి అడవి దున్నలు
 • పాపికొండలు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం

జాతీయ పార్కులు

 • జాతీయ పార్కు పాత జిల్లా
 • మృగవని జాతీయపార్కు హైదరాబాద్ – రంగారెడ్డి
 • మహవీర్ హరిణ వనస్థలి హైదరాబాద్ – రంగారెడ్డి
 • కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు హైదరాబాద్

టైగర్ ప్రాజెక్టులు


కవ్వాల్ అభయారణ్యం
ఇది ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. దీనిని 1965లో స్థాపించారు. దీని పరిధి ఎక్కువగా నిర్మల్ జిల్లాలో విస్తరించి ఉంది. కవ్వాల్ పులుల కేంద్రాన్ని 2012లో గుర్తించారు. ఇది మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం, సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉంది. దీనిని 2015 ఏప్రిల్ 29న జీవ వైవిధ్యాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేశారు.

ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం
దీనిని 1978లో వన్యమృగ సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. ఇది నాగర్ కర్నూలు, నల్లగొండ జిల్లాలో విస్తరించి ఉంది. రాష్ట్ర విభజనకు ముందు ఇది నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్ – శ్రీశైలం అభయారణ్యం కింద ఉండేది. ఇది దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యం. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ అటవీ కేంద్రంలో గల ఫరహబాద్ ఫారెస్ట్ టైగర్ జోన్‌ను సఫారీ కోసం వినియోగిస్తున్నారు.

ఔషధ అభయారణ్యం
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిని రాష్ట్ర ఔషధ అభయారణ్యంగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. అనంతగిరి కొండలను ‘తెలంగాణ ఊటీ’గా పిలుస్తారు. ఇవి మూసీ నదికి జన్మస్థానం. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ధూలపల్లిలో ఉంది.

తెలంగాణ బయో డైవర్సిటీ బోర్డు
జీవ వైవిధ్య సంరక్షణ చట్టం 2002ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం జీవ వనరులను కాపాడటం, సక్రమంగా వినియోగించడం కోసం 2014 అక్టోబర్ 10న తెలంగాణ బయో డైవర్సిటీ బోర్డును ఏర్పాటుచేసింది.
CAMPA (compensatory afforestration fund management and planning authority)
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు, అటవీయేతర వినియోగం కోసం మళ్లించిన అటవీ భూములకు పరిహారంగా అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 2009 నుంచి అమలు చేస్తున్నారు.

Advertisement

జింకల పార్కులు

పార్కు పాత జిల్లా కొత్త జిల్లా
మృగవని హైదరాబాద్ – రంగారెడ్డి రంగారెడ్డి
మహవీర్ వనస్థలి హైదరాబాద్ – రంగారెడ్డి రంగారెడ్డి
పిల్లలమర్రి మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్
పోచారం మెదక్ – నిజామాబాద్ మెదక్ – కామారెడ్డి
విజయ్ విహార్ నల్లగొండ(నాగార్జున సాగర్) నల్లగొండ(నాగార్జున సాగర్)
అలీసాగర్ నిజామాబాద్ నిజామాబాద్
శామీర్‌పేట రంగారెడ్డి మేడ్చల్– మల్కాజిగిరి
కిన్నెరసాని ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం

RECENT POSTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!