తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB).. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 60 సైంటిఫిక్ ఆఫీసర్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 15 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మొత్తం పోస్టులు: 60 పోస్టులు
విద్యార్హతలు:
సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు ( ఫిజికల్ / జనరల్, కెమికల్, బయాలజీ / సెరాలజీ, కంప్యూటర్స్) 10 – సంబంధిత విభాగాలలో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.
సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్ / జనరల్, కెమికల్, బయాలజీ / సెరాలజీ, కంప్యూటర్స్) 32- సంబంధిత విభాగాలలో ఎమ్మెస్సీ పాసై ఉండాలి.
ల్యాబొరేటరీ టెక్నీషియన్ (ఫిజికల్ / జనరల్, కెమికల్, బయాలజీ / సెరాలజీ)12- సంబంధిత విభాగాలలో బీఎస్సీ పాసై ఉండాలి.
ల్యాబొరేటరీ టెక్నీషియన్ (కంప్యూటర్స్)5- కంప్యూటర్స్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్గా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా బీసీఏ పాసై ఉండాలి.
ల్యాబొరేటరీ అటెండెంట్1- ఇంటర్ (MPC లేదా Bi.PC) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: నవంబర్ 27వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చివరి తేదీ: అభ్యర్థులు డిసెంబర్ 15 వ లోపు అప్లై చేసుకోవచ్చు.
జీతం:
సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు రూ. 45,960- 1,24,150.
సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ. 42,300 –1,15,270.
ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకు రూ. 24,280 –72,850.
ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు రూ. 20,280 –62,110.
వయస్సు: (01-07-2025 నాటికి):
అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష
వెయిటేజ్ మార్కులు
అప్లికేషన్ విధానం:
అర్హులైన అభ్యర్థులు TSLPRB అధికారిక వెబ్సైట్ www.tgprb.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.





