నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) పోస్టుల భర్తీకి సంబంధించి 190 పోస్టులతో షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. రెవెన్యూ విభాగం పరిపాలన నియంత్రణలో.. ఉన్న ఈ పోస్టులను గ్రేడ్-I,గ్రేడ్-II, గ్రేడ్-III కేటగిరీల కింద భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
మొత్తం 190 పోస్టులను మూడు గ్రేడ్లుగా విభజించారు.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I: 41 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-II: 62 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III: 87 పోస్టులు
జోన్ల వారీగా ఖాళీలు:
తెలంగాణలోని 7 జోన్ల పరిధిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రధాన జోన్ల వారీగా పోస్టుల వివరాలు..
కాళేశ్వరం జోన్ (Zone 1): ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కలిపి మొత్తం 6 పోస్టులు ఉన్నాయి.
బాసర జోన్ (Zone 2): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రాజన్న జోన్ (Zone 3): కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 7 పోస్టులు ఉన్నాయి.
భద్రాద్రి జోన్ (Zone 4): కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ పరిధిలో అత్యధికంగా 20 పోస్టులు ఉన్నాయి.
యాదాద్రి జోన్ (Zone 5): సూర్యాపేట,నల్గొండ,భువనగిరి,జనగాం జిల్లాల్లో భారీగా 54 పోస్టులు ఉన్నాయి.
చార్మినార్ జోన్ (Zone 6): మేడ్చల్-మల్కాజిగిరి,హైదరాబాద్,రంగారెడ్డి,సంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల పరిధిలో అత్యధికంగా 67 పోస్టులు భర్తీ చేయనున్నారు.
జోగులాంబ జోన్ (Zone 7): మహబూబ్‌నగర్,నారాయణపేట,గద్వాల,వనపర్తి,నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 28 ఖాళీలు ఉన్నాయి.
అర్హత,ఎంపిక ప్రక్రియ:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి స్థాయి విద్యార్హతలు, వయస్సు వివరాలు త్వరలో విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్లో వెల్లడిస్తారు. సాధారణంగా..
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండవచ్చు (రిజర్వేషన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరిగే అవకాశం ఉంది.
ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు తెలంగాణ దేవాదాయ శాఖ లేదా సంబంధిత రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
1.అధికారిక వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి.
- ముందుగా రిజిస్ట్రేషన్ చేస్తే..యూజర్ ఐడీ వస్తుంది.
- తర్వాత అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన వివరాలను ఫిల్ చేయాలి.
- అవసరమైన సర్టిఫికెట్లు, ఫోటో,సంతకాన్ని అప్లోడ్ చేయాలి.
5.చివరగా అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.





