తెలంగాణలో సెట్ ల తేదీలు ఖరారయ్యాయి. రాష్ట్రంలో ఈ ఏడాది (2023–24) జరిగే ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 7వ తేదీ నుంచి 14 వరకు ఎంసెట్ (TS EAMCET 2023) పరీక్ష నిర్వహించనున్నారు. 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్, 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహిస్తారు.
మే 18న ఎడ్సెట్ (TS EDCET), మే 20న ఈసెట్ (TS ECET), మే 25న లాసెట్ (TS LAWCET), పీజీ ఎల్‌సెట్, మే 26, 27న ఐసెట్ (TS ICET), మే 29 నుంచి జూన్1 వరకు పీజీఈసెట్ (TS PGECET) పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.