HomeEXAMS RESULTSడీఎస్​సీ 2024 ఫలితాలు ఈ రోజే... ఇక్కడ చెక్​ చేసుకొండి

డీఎస్​సీ 2024 ఫలితాలు ఈ రోజే… ఇక్కడ చెక్​ చేసుకొండి

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. సెప్టెంబర్ 30 న ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సచివాలయంలో ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటిస్తారు. డీఎస్సీ మార్కులతో పాటు, టెట్‌ మార్కులను కూడా కలిపి ఈ ర్యాంకుల జాబితాను రూపొందించారు. అనంతరం జిల్లాల వారీగా జనరల్‌ ర్యాంకు లిస్టు విడుదల చేస్తారు.

జనరల్​ ర్యాంకింగ్​ జాబితా ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్‌ జాబితాను ప్రకటించే అవకాశముంది.  అనంతరం డీఈవోల అధ్వర్యంలో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణ తర్వాత  నియామక పత్రాలు అందజేస్తారు.

గత ఏడాది డిసెంబర్​లో అధికారం చేపట్టిన కాంగ్రెస్​ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీన 11062 టీచర్​ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు ముగిసిన తర్వాత 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి కొత్త ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ఈసారి తొలిసారిగా ప్రభుత్వం కంప్యూటర్​ బేస్డ్ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. మొత్తం 2,45,263 మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యారు.  ఆగస్ట్ 13వ తేదీన రాష్ట్ర విద్యా శాఖ ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. ప్రిలిమినరీ కీ పై ఆగస్ట్ 20వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. సెప్టెంబర్​ 6వ తేదీన ఫైనల్​ కీ విడుదల చేసింది.

ఈ పరీక్షల్లో అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

డీఎస్సీ జనరల్ ర్యాకింగ్ లిస్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి:
https://tgdsc.aptonline.in/tgdsc/

జిల్లాల వారీగా డీఎస్సీ పోస్టుల జాబితా 2024

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here