తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష 2024 తుది కీ, ఫలితాలు త్వరలోనే విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడుల్లో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షల తుది కీ మంగళవారం లేదా బుధవారం (సెప్టెంబరు 3 లేదా 4న) విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమవుతోంది.1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితా ఆగస్టు 13న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీని విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షల ప్రశ్నలపై 28 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చాయి. ఆగస్టు 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్ ద్వారా స్వీకరించిన విషయం తెలిసిందే. డీఎస్సీ మార్కులకు… టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకు లిస్టు విడుదల చేస్తారు. తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. డీఈఓలు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక పత్రాలు అందజేస్తారు.