రాష్ట్రంలోని బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 గురుకుల డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు ఓ ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, బీఏ, బీకాంతో పాటు డిమాండ్ ఉన్న బీబీఏ, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ (VFX) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గురుకులాల్లో ఇంటర్ చదివిన వారు నేరుగా తమ ప్రిన్సిపాళ్లను కలిసి అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్ లేదా 040-23328266 నంబర్ సంప్రదించవచ్చు.
అందుబాటులో ఉన్న కోర్సులు:
సంప్రదాయ కోర్సులతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే కోర్సులను గురుకులాల్లో ప్రవేశపెట్టారు.
సాధారణ కోర్సులు: బీఎస్సీ, బీఏ, బీకాం.
ప్రొఫెషనల్ కోర్సులు: బీబీఏ (BBA)
క్రియేటివ్ కోర్సులు: ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా యానిమేషన్ , వీఎఫ్ఎక్స్ (Animation & VFX)వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు, అప్లికేషన్ విధానం:
ప్రధానంగా బీసీ గురుకులాల్లోనే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ ప్రవేశాల్లో ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత విద్యార్థులు తమ కాలేజీ ప్రిన్సిపాళ్లను నేరుగా సంప్రదించి, అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటర్ రిజల్ట్ ఆధారంగా ఆయా కోర్సుల్లో సీట్లను కేటాయిస్తారు.





