తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి జిల్లాస్థాయి సెలక్షన్ కమిటీలు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే మహిళా, శిశు, వికలాంగుల.. వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్మల్, హన్మకొండ జిల్లాలలో అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అర్హత , ఆసక్తి గల స్థానిక మహిళా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు ఇదొక చక్కటి అవకాశం. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
- నిర్మల్ జిల్లా అంగన్వాడీ పోస్టుల వివరాలు:(మొత్తం 89పోస్టులు)
నిర్మల్ జిల్లా పరిధిలోని ఖాన్సా, ఖానాపూర్, ముధోల్ , నిర్మల్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులను మొదటి విడతలో భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్లకు చివరి తేదీ: సెప్టెంబర్ 30 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
- హన్మకొండ జిల్లా అంగన్వాడీ పోస్టుల వివరాలు: (మొత్తం 55 పోస్టులు)
హన్మకొండ జిల్లాలో భీమదేవరపల్లి, హనుమకొండ అర్బన్,పరకాల ICDS ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 55 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భీమదేవరపల్లి ప్రాజెక్ట్: 23 పోస్టులు
హనుమకొండ అర్బన్ ప్రాజెక్ట్: 19 పోస్టులు
పరకాల ప్రాజెక్ట్: 13 పోస్టులు
అప్లికేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 6 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హత, వయస్సు పరిమితి:
విద్యార్హత: అంగన్వాడీ టీచర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. హెల్పర్స్ పోస్టులకు టెన్త్ అర్హత ఉంటే చాలు.
వయస్సు:అభ్యర్థుల వయస్సు జులై 1, 2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
స్థానికత:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పని సరిగా స్థానికులై ఉండాలి. పట్టణ ప్రాంతాల వారైతే సంబందిత వార్డు లేదా డివిజన్ నివాసి అయి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల వారైతే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ లేదా ఆవాస ప్రాంతానికి చెందినవారై ఉండాలి. ఇతర ప్రాంతాల వారు అప్లై చేయడానికి అర్హులు కాదు.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన పారదర్శకంగా జరుగుతుంది.
ఇంటర్ మార్కుల మెరిట్: 70 మార్కులు
ప్రత్యేక కేటగిరీలు: వితంతువులకు 5 మార్కులు, అనాథలకు 10 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు వెయిటేజీ ఇస్తారు.
ఇంటర్వ్యూ: జిల్లా ఎంపిక కమిటీ.. నిర్వహించే ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు.
అప్లై చేసే విధానం:
అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్సైట్ wdcw.tg.nic.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ సమయంలో ఆన్లైన్ లో టెన్త్ మెమో, ఇంటర్ సర్టిఫికెట్,కాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.





