రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. తాజాగా సిద్దిపేట , కరీంనగర్ జిల్లాల్లోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో అంగన్వాడి టీచర్, ఆయా (హెల్పర్) పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అర్హత గల స్థానిక మహిళా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ రెండు జిల్లాలకు సంబంధించిన ఖాళీలు, అర్హతలు, ఎంపిక విధానం, ఆన్లైన్ అప్లికేషన్ల చివరి తేదీ వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్రంలో మొత్తం 15,982 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల కాగా.. తాజాగా సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
- సిద్దిపేట జిల్లా అంగన్వాడీ నోటిఫికేషన్ వివరాలు:
సిద్దిపేట జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో గల 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల (చేర్యాల్, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట్) పరిధిలో మొత్తం 91 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు: మొత్తం 91 ఖాళీలలో 78 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 13 హెల్పర్ (ఆయా) పోస్టులు ఉన్నాయి.
చేర్యాల్: టీచర్-04, హెల్పర్-01
దుబ్బాక: టీచర్-06, హెల్పర్-01
గజ్వేల్: టీచర్-16, హెల్పర్-01
హుస్నాబాద్: టీచర్-19, హెల్పర్-10
సిద్దిపేట: టీచర్-13, హెల్పర్-40
- కరీంనగర్ జిల్లా అంగన్వాడీ నోటిఫికేషన్ వివరాలు:
కరీంనగర్ జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ పరిధిలోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్టుల (గంగాధర, హుజురాబాద్, కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్) పరిధిలో మొదటి విడతగా 60 అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
ప్రాజెక్ట్‌ల వారీగా టీచర్ పోస్టులు:
గంగాధర: 20
హుజురాబాద్: 16
కరీంనగర్ (రూరల్): 16
కరీంనగర్ (అర్బన్): 08
అర్హతలు, వయోపరిమితి:
ఈ రెండు జిల్లాలలోని పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే.. సంబంధిత వార్డులో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్వాడి కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తూ ఉండాలి.
ఎంపిక విధానం,వెయిటేజీ మార్కులు:
అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగనుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు. అలాగే ఇంటర్ లో వచ్చిన మార్కులకు 70 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో పాటు వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక వెయిటేజీ మార్కులు కేటాయించడం జరిగింది.
అప్లికేషన్ విధానం:
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి ఆగస్ట్ 15 చివరి తేదీగా నిర్ణయించారు.
ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్:
1.కాస్ట్ సర్టిఫికెట్
2.స్టడీ సర్టిఫికెట్స్
3.రెసిడెన్సీ సర్టిఫికెట్
4.అంగవైకల్యం ఉన్నవారు సదరం సర్టిఫికేట్
5.వితంతువులైతే భర్త డెత్ సర్టిఫికెట్ / అనాథలైతే సంబంధిత డాక్యుమెంట్స్





