తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్స్ మిషన్ (TEAM)..యాదాద్రి భువనగిరి జిల్లా.. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, పలు జిల్లా శాఖల్లో ఖాళీగా ఉన్న 70 అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, డ్రైవర్, ఆఫీస్ సబ్ఆర్డినేట్, పారామెడికల్ సిబ్బంది సహా మొత్తం 24 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 18 నుంచి 44 ఏళ్ల వయస్సు ఉండి, సంబంధిత విద్యార్హత కలిగిన స్థానిక అభ్యర్థులు మాత్రమే.. ఈ పోస్టులకు అర్హులు. సెప్టెంబర్ 16 నుంచి 23 (సాయంత్రం 5 గంటల) వరకు ఆఫ్ లైన్ విధానంలో.. నేరుగా జిల్లా కలెక్టర్ ఆఫీసులో.. సమర్పించాల్సి ఉంటుంది. ఎంపిక కేవలం విద్యార్హతల మెరిట్, రోస్టర్ ఆధారంగా జరుగుతుంది.
ముఖ్యమైన వివరాలు:
మొత్తం ఖాళీలు: 70 పోస్టులు
అప్లికేషన్ విధానం: ఆఫ్లైన్ లో అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 16 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ: సెప్టెంబర్ 23 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ. 50 (నగదు రూపంలో మాత్రమే చెల్లించాలి)
ఖాళీలు – జీతాల వివరాలు:
రూ. 22,750 జీతం పొందే పోస్టులు: స్పీచ్ థెరపిస్ట్ (1), సైకియాట్రిక్ సోషల్ వర్కర్ (1), ల్యాబ్ టెక్నీషియన్ (1), ECG టెక్నీషియన్ (1), డెంటల్ టెక్నీషియన్ (1), చైల్డ్ సైకాలజిస్ట్ (1), ఆడియోమెట్రీ టెక్నీషియన్ (1), రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ (1), OT టెక్నీషియన్ (2), బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ (3).
రూ. 19,500 జీతం పొందే పోస్టులు: డేటా ఎంట్రీ ఆపరేటర్ (16), డ్రైవర్ (6), థియేటర్ అసిస్టెంట్ (3), బార్బర్ (3), టైలర్ (1), రికార్డ్ అసిస్టెంట్ (1), ప్లంబర్ (1), కార్పెంటర్ (1), మ్యూజియం అసిస్టెంట్ (1).
రూ. 15,600 జీతం పొందే పోస్టులు: ఆఫీస్ సబ్ఆర్డినేట్ (14), ల్యాబ్ అసిస్టెంట్ (4), వార్డ్ బాయ్ (2), ధోబీ/ప్యాకర్ (3), ఆడియో విజువల్ టెక్నీషియన్ (1).
అర్హతలు & వయోపరిమితి:
పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, B.Sc MLT, BASLP లేదా సంబంధిత పారామెడికల్ విద్యార్హతలు ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. యాదాద్రి భువనగిరి జిల్లా స్థానికత ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్లకు అర్హులు.
ఎంపిక విధానం:
అభ్యర్థుల విద్యార్హతలలో.. సాధించిన మెరిట్, రోస్టర్ పద్ధతి, పారామెడికల్ రూల్స్ ప్రకారం నేరుగా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారంతో పాటు సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, రెసిడెన్స్ సర్టిఫికెట్ జతచేసి, రూ. 50 అప్లికేషన్ ఫీజు నగదు రూపంలో చెల్లించి “రూమ్ నెం. F8, తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్స్ మిషన్ (TEAM), జిల్లా కలెక్టర్ కార్యాలయం, యాదాద్రి భువనగిరి” చిరునామాలో పనివేళల్లో నేరుగా అందజేయాలి.





