తెలంగాణలో టీచర్ల భర్తీపై నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల్లో టీచర్ల రిక్రూట్మెంట్ (DSC) షెడ్యూలు విడుదల చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ప్రకటనతో ఏళ్లకేళ్లుగా టీచర్ జాబ్లకు ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలు చిగురించాయి. ఈసారి మొత్తం 6612 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అందులో 5089 రెగ్యులర్ టీచర్ల పోస్టులు, 1523 స్పెషల్ టీచర్ల పోస్టులున్నాయి.
మొత్తం ఖాళీలు | 6612 |
రెగ్యులర్ టీచర్లు | 5089 |
స్పెషల్ టీచర్లు | 1523 |
ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలున్నాయి.. ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది విద్యాశాఖ ఇటీవలే కసరత్తు చేసింది. ఇటీవల సేకరించిన సమాచారం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 5089 ఖాళీలున్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 1739 , సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT ) 2575 , లాంగ్వేజ్ పండిట్లు 611 , ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PET ) 164 పోస్టులున్నాయి. వీటితో పాటు 1523 స్పెషల్ టీచర్ల ఖాళీలున్నాయి. 796 ప్రయిమరీ స్కూల్స్, 727 అప్పర్ ప్రయిమరీ స్కూల్స్ లో స్పెషల్ టీచర్ల ఖాళీలున్నాయి. వీటన్నింటి భర్తీకి ఇటీవల రాష్ట్ర ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది.
రెగ్యులర్ టీచర్లు | 5089 |
స్కూల్ అసిస్టెంట్లు | 1739 |
సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) | 2575 |
లాంగ్వేజీ పండిట్లు | 611 |
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PET) | 164 |
SGT