రెండు రోజుల్లో dsc షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మొత్తం 6612 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వీటిలో 5089 రెగ్యులర్ టీచర్ల భర్తీతో పాటు 1583 స్పెషల్ టీచర్ల భర్తీకి చర్యలు చేపడుతున్నామన్నారు. TSPSC ద్వారా కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. మరో రెండు రోజుల్లో విధివిధానాలతో పాటు షెడ్యూలు విడుదల చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Advertisement