సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్స్‌కు ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ గుడ్‌న్యూస్ చెప్పింది. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఆఫ్- క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ (బీపీఎస్) పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
2020, 2021 పాసైన అభ్యర్థులకు ఛాన్స్
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఎప్పుడనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం 2020, 2021 పాసైన విద్యార్థులకు కోసం మాత్రమే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తుండగా.. త్వరలోనే 2019 పాస్ అవుట్ విద్యార్థులకు కూడా నిర్వహిస్తామని తెలిపింది. అయితే వారి కోసం త్వరలోనే రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ చేస్తామని పేర్కొంది.
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో 10, 12వ తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కేవలం 2020 లేదా 2021 ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ (బీఈ),- బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్),- మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎంఈ),- మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్), మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ),- మాస్టర్స్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే.. అభ్యర్థుల వయస్సు 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్
అభ్యర్థుల ఎంపిక మొత్తం రెండు రౌండ్లలో జరుగుతుంది. రౌండ్-1లో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్ని క్లియర్ చేసిన వారికి రౌండ్-2లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
వెబ్సైట్: www.tcs.com