HomeLATEST3800 కోర్సెరా ఫ్రీ ఆన్​ లైన్​ కోర్సులు: తెలంగాణ గవర్నమెంట్​ ఆఫర్​

3800 కోర్సెరా ఫ్రీ ఆన్​ లైన్​ కోర్సులు: తెలంగాణ గవర్నమెంట్​ ఆఫర్​

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు అందించేందుకు తెలంగాణ స్కిల్​ అకాడమీ ‘కోర్సెరా’ సంస్థతో కలిసి పార్టనర్​షిప్​ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఇందులో 3,800 ఆన్​లైన్​ కోర్సులున్నాయి. జులై 31వ తేదీ వరకు వీటిని ఉచితంగా ఆఫర్​ చేస్తున్నారు. ప్రపంచంలో పేరొందిన యేల్‌, ఇల్లినాయిస్‌, కొలంబియా యూనివర్సిటీలు, ఐఎస్‌బీ, ఐబీఎం, ఇంటెల్‌ తదితర సంస్థల భాగస్వామ్యంతో కొర్సెరా ఆన్‌లైన్‌ డిగ్రీ, సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తోంది. రాష్ట్రంలోని జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ, కాకతీయ, మహాత్మాగాంధీ వర్సిటీల పరిధిలో చదువుతున్న విద్యార్థులందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని స్టేట్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్​ బోర్డు పిలుపునిచ్చింది. అన్ని యూనివర్సిటీల విద్యార్థులు జులై 30లోగా కోర్సెరా వెబ్​సైట్​లో తమ పేర్లు రిజిస్టర్​ చేసుకోవాలని సూచించింది. మరోవైపు టాస్క్​.. రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఈ కోర్సులను ఆఫర్​ చేసింది. తమ వెబ్​సైట్​ ద్వారా సెప్టెంబర్​ 30లోగా పేర్లు నమోదు చేసుకోవాలని ప్రకటించింది. పేర్ల నమోదుకు క్లిక్​ చేయండి https://www.task.telangana.gov.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!