Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSకానిస్టేబుల్​ ప్రిలిమినరీ ఎగ్జామ్​కు చదవాల్సిన​ టాపిక్స్​​

కానిస్టేబుల్​ ప్రిలిమినరీ ఎగ్జామ్​కు చదవాల్సిన​ టాపిక్స్​​

Telangana Constable Recruitment(TSLPRB) 2022కి సిద్ధమవుతున్న అభ్యర్థులు సిలబస్‌పై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. అందులో ఏమేం టాపిక్ లు ఉన్నాయనేది తెలుసుకొని ప్రిపరేషన్​ మొదలు పెట్టాలి. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ కు మొదట ప్రిలిమినరీ టెస్ట్ (PT) తర్వాత ఫైనల్ రాత పరీక్ష (FWE) ఉన్నాయి. సివిల్​, ఎక్సైజ్​ అన్ని కేటగిరీల్లో మొత్తం దాదాపు 17 వేల కానిస్టేబుల్​ పోస్టులున్నాయి. అందుకే పోటీ ఎక్కువగానే ఉంటుంది. అభ్యర్థులు అందుకు అనుగుణంగా సిలిబస్​లో ముఖ్యమైన టాపిక్స్​ వైజ్​ ప్రిపరేషన్​ స్టార్ట్ చేయాలి.

ప్రిలిమినరీ టెస్ట్ 200 మార్కులకు ఆబ్జక్టివ్​ పద్ధతిలో ఉంటుంది. ఇంగ్లిష్​, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్‌పై (ఇంటర్మీడియట్​ స్థాయి) ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 30 శాతం మార్కులు సాధిస్తే తదుపరి ఈవెంట్లకు, మెయిన్​ ఎగ్జామ్​కు క్వాలిఫై అవుతారు.

ప్రిలిమినరీ ఎగ్జామ్​ సిలబస్
(ఇంటర్మీడియట్ స్టాండర్డ్) (ఆబ్జెక్టివ్ టైప్) (200 ప్రశ్నలు)

  1. English
  2. Arithmetic
  3. General Science
  4. History of India, Indian culture, Indian National Movement
  5. Principles of Geography, Indian Geography, Polity and Economy
  6. Current events of national and international importance
  7. Test of Reasoning / Mental Ability
  8. Contents pertaining to the State of Telangana.
  1. ఇంగ్లీష్
  2. అర్ధిమెటిక్
  3. జనరల్ సైన్స్
  4. భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయ ఉద్యమం
  5. భౌగోళిక సూత్రాలు, భారతీయ భౌగోళిక శాస్త్రం, రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థ
  6. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు
  7. రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ పరీక్ష
  8. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు

TSLPRB Constable Syllabus 2022 Subject wise important Topics 

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ సిలబస్ చదవాల్సిన టాపిక్స్​ ఇవే:

1.  English

  • Articles, Prepositions, The Conjunctions
  • Tenses & The Verbs
  • Types of Sentences
  • Spellings
  • Synonyms and Antonyms
  • Sentences corrections
  • One word substitution
  • Questions from Given Passages
  • Active Voice and Passive Voice
  • Direct and Indirect Speech
  • Degrees of Comparision

2. అర్థిమెటిక్​

చక్ర వడ్డీ మరియు బారువడ్డి, నిష్పత్తి మరియు అనుపాతం,
సగటు, వయస్సులు, శాతాలు, లాభం నష్టం, కాలం & పని, పని & జీతాలు,
కసాగు గసాబా, కాలం & దూరం, వాటాలు, భాగస్వామ్యులు. సగటు సరాసరి,
ప్యూర్ మాథ్స్; క్షేత్ర గణితం (mensuration), సంఖ్యా వ్యవస్థ ( Number system), రేఖాగణితం(Geometry), శ్రేడులు (Progressions), సమితులు (sets), బీజగణితం (algebra),    ఎత్తులు – దూరాలు (heights & distances)

3. జనరల్ సైన్స్

మన విశ్వం, యాంత్రిక శాస్త్రం, ధ్వని, కాంతి, ఉష్ణం, ఉష్ణోగ్రత, విద్యుత్తు, ఆధునిక భౌతిక శాస్త్రం, పదార్థం, పరమాణు నిర్మాణం, లోహాలు, కేంద్రక రసాయన శాస్త్రం, రసాయన బంధం, జీవాణువులు, ప్లాస్టిక్​లు, దారాలు, మందులు, ఇంధనాలు, ఆమ్లాలు, క్షారాలు, పర్యవరణ రసాయన శాస్త్రం, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, జ్ఞానాంగాలు, జంతు వైవిధ్యం, జంతు కణజాలాలు, జంతుప్రవర్తన, వ్యాధులు, ఆహారం, జన్యు శాస్త్రం,

4. భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయ ఉద్యమం

ప్రాచీన భారత దేశ చరిత్ర; రాతియుగం, సింధూలోయ నాగరికత, వేద నాగరికత, బౌద్ధ, జైన మతాలు, మౌర్య సామ్రాజ్యం, విదేశీ రాజ వంశాలు, శాతవాహనులు, సంగం, గుప్త సామ్రాజ్యం, పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు, రాజపుత్రులు, ప్రతిహారులు, చౌహానులు
మధ్యయుగ భారత దేశ చరిత్ర; యామిని వంశం, ఘోరి వంశం, ఢిల్లీ సుల్తానులు, బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్​ వంశం, సయ్యద్​ వంశం, లోడీ వంశం, మొగల్​ సామ్రాజ్యం, భక్తి ఉద్యమాలు
ఆధునిక భారత దేశ చరిత్ర; ఇండియాలో గిరిజన తిరుగుబాట్లు, 1867 తిరుగుబాటు, కారణాలు, ఫలితాలు, 19వ శతాబ్ది సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు,
భారత జాతీయోద్యమం (జాతీయ కాంగ్రెస్​, రౌండ్​ టేబుల్​ మీటింగ్స్​, మితవాదులు, అతివాదుల దశ, గాంధీజీ యుగం, బెంగాల్​ గవర్నర్​ జనరల్స్​, ఇండియా గవర్నర్​ జనరల్స్, వైస్రాయ్ లు)
బారతీయ సంస్కృతి (ప్రాక్​ సంస్కృతి, సింధూ సంస్కృతి, వైదిక సంస్కృతి, జైన బౌద్ధ సంస్కృతి, ప్రాచీన సమాజం) , సంగీతం, చిత్రలేఖనం, వాస్తు శిల్పకల, శాస్త్రీయ నృత్యాలు, మతాలు, సాంస్కృతిక సంస్థలు

5. భౌగోళిక సూత్రాలు, భారతీయ భౌగోళిక శాస్త్రం, రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థ

ఇండియన్ జాగ్రఫీ
మన విశ్వం, భూస్వరూప శాస్త్రం, పునరుత్పాదక, అనుత్పాదక వనరులు (Renewable and Non renwable resources), సహజ వనరులు, ఇంధన వనరులు, విపత్తులు, విపత్తుల నిర్వహణ, భారత దేశ ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, నదులు, మృత్తికలు, అడవులు, వ్యవసాయం, నీటి పారుదల, ఖనిజ వనరులు, విద్యుత్, పరిశ్రమలు, రవాణా, జనాభా.
రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థ; భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, పరిపాలన, ప్రభుత్వ విధానం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. జాతీయాదాయం, ప్రణాళికలు, నీతి అయోగ్​, పేదరికం, నిరుద్యోగం, బ్యాంకులు, బడ్జెట్​, భారత పన్నుల వ్యవస్థ, జీఎస్టీ, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, ఆహార భద్రత, అర్థిక సంస్కరణలు, విదేశీ వాణిజ్య విధానం, మానవాభివృద్ధి సూచీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు

6., జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు

ఎగ్జామ్​ తేదీ నాటికి ఆరు నెలల ముందు కరెంట్​ అఫైర్స్ పై అవగాహన పెంచుకోవాలి. దేశాలు మరియు రాజధానులు, ముఖ్యమైన రోజులు, క్రీడలు, అవార్డులు, రక్షణ, సమావేశాలు, పుస్తకాలు మరియు రచయితలు, స్టాటిక్ GK

7. రీజనింగ్ అండ్​ మెంటల్​ ఎబిలిటీ

శ్రేణులు (Series), కోడింగ్‌ డీకోడింగ్‌ (Coding Decoding), భిన్న పరీక్ష (Oddmanout), అక్షరమాల పరీక్ష (Alphabet test), పోలిక / సాద్యశ్వ పరీక్ష(Analogy), రక్త సంబంధాలు (Blood Relations), దిశాత్మక పరీక్ష(Direction sense test), నంబర్‌, ర్యాంకింగ్‌ & టైమ్‌ సీక్వెన్స్‌ టెస్ట్‌ (Number, Ranking and Time Sequence test) సీటింగ్‌ / ప్లేసింగ్‌ అరేgజ్‌మెంట్స్‌ (Seatings/ Placing Arrangements), పజిల్‌ టెస్ట్‌ (Puzzle test), లాజికల్‌ వెన్‌ చిత్రాలు (logical Ven Diagrams). మ్యాథమెటికల్‌ సెన్స్‌ టెస్ట్​ (Mathematical sense test), మిస్సింగ్‌ కారెక్టర్‌(Missing Character), ప్రకటనలు-తీర్మానాలు Statements and conclusions), ప్రకటనలు- ఊహలు (Statements Assumptions), ప్రకటనలు మరియు వాదనలు (Statements and Arguments), నిశ్చితం కారణం (Assertion-Reason), అనాలజీ (Analogy)

8. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు

తెలంగాణ ఉద్యమం, ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర, కవులు రచయితలు, పండుగలు, జాతరలు, నదులు, ప్రాజెక్టులు, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కొత్త జిల్లాలకు సంబంధించిన అన్ని ముఖ్యాంశాలపై పట్టు సాధించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!