Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSరూరల్​ ఏరియా నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్ విత్ హాస్టల్, జాబ్​ గ్యారంటీ కోర్సులు​

రూరల్​ ఏరియా నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్ విత్ హాస్టల్, జాబ్​ గ్యారంటీ కోర్సులు​

యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వామీ రామానంద తీర్థ రూరల్​ ఇనిస్టిట్యూట్​లో తెలంగాణాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Advertisement

ఆటోమొబైల్​, సెల్​ఫోన్​, ఎలక్ట్రానిక్​ వస్తువుల రిపేర్​, ఎలక్ట్రిషియన్​, సోలార్​ సిస్టమ్​ ఇన్​స్టాలేషన్​ అండ్​ సర్వీస్​, టైలరింగ్​లో శిక్షణ పొందడానికి టెన్త్​, ఐటీఐ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 ఏళ్ల నుంచి 35 మధ్య ఉండాలి.

తప్పనిసరిగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఆపేసిన వారు అనర్హులు. అప్లికేషన్​ చేసేందుకు అభ్యర్థుల ఒరిజినల్​ స్టడీ సర్టిఫికేట్స్​, జిరాక్స్​ కాపీల సెట్​, పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటోలు, ఆధార్​కార్డ్​, రేషన్​కార్డ్​, రూ.250 డిపాజిట్​ చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫారాలను నేరుగా స్వామీ రామానంద తీర్థ గ్రామీణ సంస్థ కార్యాయలంలో సమర్పించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్​ ఫిబ్రవరి 14 సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు 9133908000, 9133908111, 9948466111 ఫోన్​ నంబర్లలో సంప్రదించవచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!