HomeCAREERఐఐటీ హైదరాబాద్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్.. మార్చి 10 వరకు అప్లికేషన్లు

ఐఐటీ హైదరాబాద్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్.. మార్చి 10 వరకు అప్లికేషన్లు

ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT Hyderabad) 2026 సంవత్సరానికి Summer Undergraduate Research Exposure (SURE) పేరుతో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ ప్రకటించింది. పరిశోధన మరియు సాంకేతిక రంగాలపై ఆసక్తి ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ అందిస్తాఉ. అర్హులైన విద్యార్థులు మార్చి 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ కార్యక్రమంలో మొత్తం 250 మంది ఇంటర్న్‌షిప్​ అవకాశం కల్పిస్తారు. 100 సీట్లను ప్రత్యేకంగా మహిళా అభ్యర్థులకు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులు కనీసం ఒక నెల నుంచి గరిష్ఠంగా రెండు నెలల వరకు ఇంటర్న్‌షిప్ చేయాలి. శిక్షణ కాలంలో స్టైపెండ్ (గౌరవ వేతనం) కూడా అందిస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ మే 15 నుంచి జులై 14 వరకు కొనసాగుతుంది. ఎంపికైన విద్యార్థులకు IIT హైదరాబాద్ క్యాంపస్‌లోని హాస్టళ్లలో వసతి కల్పిస్తారు. అయితే మెస్ ఖర్చులను విద్యార్థులే భరించాల్సి ఉంటుంది.

స్టైపెండ్

  • ఒక నెల ఇంటర్న్‌షిప్ చేస్తే – రూ.7,500
  • ఒకటిన్నర నెలలు చేస్తే – రూ.10,000
  • రెండు నెలలు పూర్తి చేస్తే – రూ.15,000

అర్హతలు

ఈ ఇంటర్న్‌షిప్ అవకాశం IIT హైదరాబాద్‌లో చదవని (Non-IITH) విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  • M.Sc (Mathematics / Physics / Chemistry / Biology) మొదటి సంవత్సరం విద్యార్థులు
  • M.A మొదటి సంవత్సరం విద్యార్థులు
  • B.Tech / B.Des రెండో లేదా మూడో సంవత్సరం విద్యార్థులు
  • Integrated B.Tech – M.Tech మూడో లేదా నాలుగో సంవత్సరం విద్యార్థులు

అభ్యర్థులు తమ గత విద్యా సంవత్సరంలో సీజీపీఏ లేదా శాతం ఆధారంగా టాప్ 20% మెరిట్‌లో ఉండాలి. దరఖాస్తు సమయంలో సంబంధిత కళాశాల హెడ్ లేదా ప్రిన్సిపల్ ధ్రువీకరణ తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ

ఈ కార్యక్రమానికి ఫుల్‌టైం, రెగ్యులర్ విద్యార్థులు మాత్రమే అర్హులు. అభ్యర్థుల ఎంపికకు అకడమిక్ మెరిట్, ఒలింపియాడ్స్ , NTSE వంటి పోటీ పరీక్షల ప్రదర్శన, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. తుది ఎంపిక జాబితాను IIT Hyderabad అధికారిక వెబ్‌సైట్‌లోని SRC Office → News / Announcement విభాగంలో కూడా చూడవచ్చు.

ముఖ్య తేదీలు

  • దరఖాస్తు చివరి తేదీ: 10 మార్చి 2026
  • ఫలితాల ప్రకటన (తాత్కాలిక): 15 ఏప్రిల్ 2026
  • ఇంటర్న్‌షిప్ ప్రారంభం: 15 మే 2026
  • CLICK FOR APPLICATION
RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here